EWS Reservation: EWS రిజర్వేషన్‭కు వ్యతిరేకంగా సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసిన కాంగ్రెస్ నేత

అన్ ఎయిడెడ్ సంస్థలలో రిజర్వేషన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(జి) ప్రకారం ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం పొందని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రవేశాలపై తాజా రిజర్వేషన్ చట్టం ఎలాంటి ఒత్తిడి ఉండదు. కేవలం అగ్రవర్ణాల 10% రిజర్వేషన్ కల్పించడం సమానత్వ కోడ్‌ను ఉల్లంఘించడమే. ఇది వివక్షకు కారణం

Congress leader files review petition against EWS reservation in Supreme Court

EWS Reservation: మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన EWS రిజర్వేషన్(ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందించే రిజర్వేషన్)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ నేత జయ ఠాకూర్. వాస్తవానికి ఈ చట్టానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్‭లో మద్దతు లభించింది. అంతే కాకుండా, రాజ్యాంగంలోని 103వ చట్ట సవరణ ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజవర్వేషన్ కల్పించడం చట్ట సమ్మతమేనని స్వయంగా సుప్రీంకోర్టు ఈ మధ్యే తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రిజర్వేషన్‮‭కు వ్యతిరేకంగా అదే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.

రాజ్యాంగంలోని 103వ సవరణను సమర్థిస్తూ జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం నవంబర్ 7, 2022న జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలని పిటిషన్‭లో జయ ఠాకూర్ కోరారు. వెనుకబడిన తరగతులను పూర్తిగా మినహాయించాలనే కారణంతో చేసిన రాజ్యాంగ సవరణను భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి యు యు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్‌లు అంగీకరించారని స్పష్టమవుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

“భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని మార్చే 103వ రాజ్యాంగ సవరణ దుర్మార్గమైంది. ఇది ఇంద్ర సాహ్నీ, ఓర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం తీర్పుకు విరుద్ధం. వెనుకబడిన తరగతిని ఆర్థిక ప్రమాణాలకు సంబంధించిన ప్రాతిపదికతో మాత్రమే నిర్ణయించడం సాధ్యం కాదు” అని పిటిషన్‭లో పేర్కొన్నారు.

“అన్ ఎయిడెడ్ సంస్థలలో రిజర్వేషన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(జి) ప్రకారం ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం పొందని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రవేశాలపై తాజా రిజర్వేషన్ చట్టం ఎలాంటి ఒత్తిడి ఉండదు. కేవలం అగ్రవర్ణాల 10% రిజర్వేషన్ కల్పించడం సమానత్వ కోడ్‌ను ఉల్లంఘించడమే. ఇది వివక్షకు కారణం’’ కాంగ్రెస్ నాయకుడు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చాలా కాలంగా రిజర్వేషన్లు అమలులో ఉన్నప్పటికీ, మొత్తం ఉపాధిలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల వాటా కేవలం 47.46% మాత్రమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Baal Aadhaar Card Update : బాల ఆధార్ కార్డుపై కొత్త మార్గదర్శకాలు.. ఇకపై బయోమెట్రిక్ తప్పనిసరి.. బాల ఆధార్ అంటే ఏంటి? ఎలా అప్‌డేట్ చేసుకోవాలో తెలుసా?