45 Years Congress Leader Within 45 Hrs marriage
Uttar Pradesh : రాజకీయాల్లో ఎదగాలి..దాని కోసం కార్యకర్తగా జెండాలు మోస్తు ఉన్నతస్థాయికి ఎదిగేవారు ఎంతోమంది అంచెలంచెలుగా అలా ఎదిగి సీఎంలుగా..పీఎం అయిన రాజకీయ నేతల చరిత్రల గురించి విన్నాం. అలా ఓ వ్యక్తి తన రాజకీయ జీవితంకోసం పెళ్లే చేసుకోకుండా పార్టీ కోసం పనిచేస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు సీటు దక్కించుకోవాలనకున్నాడు. అలా అవకాశం కోసం ఎదురు చూసి చూసి 45 ఏళ్లు పెళ్లి చేసుకుండా ఉండిపోయాడు. ఆ అవకాశం వచ్చింది. ఇప్పటికైనా పెళ్లి ద్వారా తన కల నెరవేర్చుకోవాలనుకున్నాడు.అందుకు కోసం కేవలం 45 గంటల్లోనే పెళ్లి సెటిల్ చేసుకున్నాడు ఆ 45 ఏళ్ల నేత.. రాజకీయ భవిష్యత్తు కోసం అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం పడింది ఉత్తరప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ నేతకు.
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నగర మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. రాంపూర్ సీటు సీటును మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో రాంపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న 45 ఏళ్ల మామున్ ఖాన్ వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సీటు కోల్పోకూడదనే ఉద్ధేశంలో కేవలం 45 గంటల్లోనే పిల్లలను వెతుక్కోవటం పెళ్లి ముహూర్తం పెట్టేసుకోవటం జరిగింది. అలా ఓ పక్క తన పెళ్లి పనులు మరోపక్క మున్సిపల్ ఎన్నికల్లో సీటు..ఆపై గెలుపు కోసం కష్టపడుతున్నడు మూమున్ ఖాన్.
30ఏళ్లుగా రాంపూర్ నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఖాన్, తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి పక్కా ప్లాన్స్ తోనే కొనసాగుతున్నారు. ఉన్ స్థానం పోగొట్టుకోకుండా పైపైకి ఎదగటానికి యత్నిస్తున్నారు. రాంపూర్ సీటు మహిళలకు కేటాయించడంతో తానే పెళ్లి చేసుకుని తన భార్యకు ఆ సీటు దక్కాలని 45 గంటల్లోనే పెళ్లిని ఫిక్స్ చేసుకున్నాడు.
మున్సిపల్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రకటించిన తర్వాత ఖాన్ అదరాబాదరాగా పిల్లను చూసుకోవటం పెళ్లి ఫిక్స్ చేసుకోవటం చకచకా జరిగిపోయింది. నామినేషన్‌కు ఆఖరు తేదీ ఏప్రిల్ 17 కావటంతో ఖాన్ తన వివాహం ఏప్రిల్ 15కు ఫిక్స్ చేసుకున్నారు. ఈ పెళ్లి గురించి..మున్సిపల్ ఎన్నికల గురించి మామున్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు, తన వివాహం రెండింటికి పనులు జరుగుతున్నాయని తెలిపారు.నా భార్య ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు.