Rahul Gandhi : తెల్లవారుజామున ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్‌కు వెళ్లిన రాహుల్ గాంధీ.. వీడియోలు వైరల్ .. అక్కడ ఏం చేశారంటే..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో ఆసియాలోనే అతిపెద్ద కూరగాయాల హోల్‌సేల్ మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్‌కు వెళ్లారు.

Rahul Gandhi

Rahul Gandhi in Azadpur Mandi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో ఢిల్లీ (Delhi) లోని ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్‌ ( Azadpur Vegetable Market) కు వెళ్లారు. ఈ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్ మార్కెట్. అక్కడ కూరగాయలు, పండ్ల వ్యాపారులు, స్థానికులతో రాహుల్ ముచ్చటించారు. ఈ సందర్భంగా కూరగాయల ధరలపై రాహుల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ మార్కెట్‌కు చేరుకోగానే జనం గుమ్మిగూడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Rahul Gandhi Marriage: ‘రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారా’ అని ప్రశ్నించిన మహిళా రైతుకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన సోనియా గాంధీ

ఇటీవల రాహుల్ గాంధీ హర్యానాలోని సోనిపట్‌లో రైతులతో సమావేశమైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా వెళ్తుండగా మార్గం మధ్యలో హర్యానాలోని సోనీపట్ తాలుక మదీనా అనే గ్రామ శివార్లలో రాహుల్ వరి పొలంలో ట్రాక్టర్ తో దమ్ముచేశారు. ఆ తరువాత రైతు కూలీలతో కలిసి నాటు వేశారు. అప్పట్లో రాహుల్ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో ఫొటోలను పంచుకున్నాడు. వారితోకలిసి భోజనాలు చేశాడు. అదేవిధంగా ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో మోటారు మెకానిక్‌లను కలిసి వారి సమస్యలు రాహుల్ తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాహుల్ గాంధీ గతంలో తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని ఆజాద్ పూర్ కూరగాయ మార్కెట్‍‌కు రాహుల్ గాంధీ తెల్లవారు జామున ఆకస్మికంగా పర్యటించారు. అక్కడి వారిని అడిగి కూరగాయల ధరలు తెలుసుకున్నారు.

 

రాహుల్ గాంధీ శనివారం తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో ఢిల్లీలోని అజాద్‌పూర్ మార్కెట్‌లో కూరగాయల విక్రేత కన్నీళ్లు పెట్టుకున్నారు. టమోటా చాలా ఖరీదుగా మారిందని, కొనడానికి నా దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. మేము దానిని ఏ ధరకు విక్రయించగలమో కూడా మాకు తెలియదు. అవి వర్షంలో తుడినా, స్టాక్‌కు ఏదైనా జరిగితే మేము నష్టపోతాము అని బాధతో ఉన్న రైతు చెప్పాడు. ఈ వీడియోను షేర్ చేసిన రాహుల్.. దేశం రెండు వర్గాలుగా విడిపోతుంది. ఒకవైపు అధికారాన్ని కాపాడుకున్న శక్తిమంతులు, మరోవైపు సాధారణ భారతీయుడు. ఎవరి సూచనల మేరకు దేశ విధానాలు రూపొందిస్తున్నారు అంటూ రాహుల్ ప్రశ్నించాడు. కూరగాయల వంటి ప్రాథమిక వస్తువులు కూడా సామాన్య ప్రజలకు అందకుండా పోతున్నాయి. ధనిక, పేద వర్గాల మధ్య పెరుగుతున్న అంతరాన్ని మనం పూరించాలి, ఈ కన్నీళ్లను తుడవాలి అంటూ రాహుల్ పేర్కొన్నారు.