కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2019ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉపాధి కల్పన, వ్యవసాయ సంక్షోభం, విద్యా, వైద్య రంగాల బలోపేతంపై మేనిఫెస్టో ప్రధానంగా దృష్టిసారించినట్లు ఈ సంధర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఆర్థిక వృద్ధికి తమ మేనిఫెస్టో ఊతమిచ్చేలా ఉంటుందని, కేవలం ఒక వ్యక్తి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ మేనిఫెస్టో ఉండదని రాహుల్ గాంధీ చెప్పారు. మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికకు రూపకల్పన చేసింది. హమ్ నిభాయేంగే(మేం నెరవేరుస్తాం) పేరుతో మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది
మేనిఫెస్టో విడుదల కార్యక్రమంకు సోనియా గాంధీ హాజరయ్యారు. అలాగే రైతులు తీసుకున్న అప్పును తిరిగి చల్లించకపోతే ఇకపై అది క్రిమినల్ నేరం కాదు అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దక్షిణాది ప్రజలను నరేంద్ర మోడీ ఘోరంగా మోసం చేశాడని వారికి అండగా ఇప్పుడు మేము ఉన్నామని రాహుల్ గాంధీ చెప్పారు.
మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు:
గ్రామ పంచాయితీల్లో 10లక్షల ఉద్యోగాలు
దేశంలో 20శాతం మందికి ‘న్యాయ్’ పథకం(పేదవారి ఖాతాలో ప్రతీ నెల రూ.6వేలు) అమలు
అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా
యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు
రైల్వే బడ్జెట్ మాదిరిగానే వ్యవసాయ రంగం కోసం ప్రత్యేక బడ్జెట్( కిసాన్ బడ్జెట్) అమలు
ఎడ్యుకేషన్‌కు 6శాతం జీడీపీ
ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకు బలం చేకూర్చడం. అమెరికాలో తరహాలో కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లటం.
దేశవ్యాప్తంగా స్త్రీల భద్రతకు చర్యలు