బరిలో షీలా దీక్షిత్ : ఢిల్లీ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

ఢిల్లీ లోని మొత్తం ఏడు లోక్ సభ స్థానాలకు గాను ఆరు స్థానాలకు సోమవారం(ఏప్రిల్-22,2019) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరుని కాంగ్రెస్ ప్రకటించింది.
Also Read : శ్రీలంక బాంబు పేలుళ్లు : హైదరాబాద్ లో అలర్ట్ : HMWSSB

చాందినీ చౌక్ స్థానం నుంచి జేపీ అగర్వాల్, తూర్పు ఢిల్లీ నుంచి అర్విందర్ సింగ్ లవ్లీ, న్యూఢిల్లీ నుంచి అజయ్ మాకెన్, నార్త్ వెస్ట్ ఢిల్లీ(ఎస్పీ రిజర్వ్డ్)నుంచి రాజేష్ లిలోథియా,వెస్ట్ ఢిల్లీ నుంచి మహబల్ మిశ్రా పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.ఆరో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో భాగంగా మే-12,2019న ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.మే-23,2019న ఫలితాలు వెలువడనున్నాయి.