PT Thomas : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్యే థామస్ ఇకలేరు

కాంగ్రెస్ సీనియర్ నేత థామస్ (71) క్యాన్సర్ తో బాధపడుతూ తుదిశ్వాస విధించారు. కేరళ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న థామస్.. త్రిక్కకరా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Congress Leader

PT Thomas: కేరళలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఎమ్మెల్యే పీటీ థామస్ (71) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన ప్రస్తుతం కేరళ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న థామస్ నెలక్రితం తమిళనాడులోని వెల్లూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం కన్నుమూశారు.

చదవండి : Congress On Gogoi Remarks : నచ్చినప్పుడు రాజ్యసభకు వెళ్తానన్న గొగొయ్..పార్లమెంట్ కు అవమానమన్న కాంగ్రెస్

ప్రస్తుతం థామస్ త్రిక్కకరా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేరళ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో థామస్ ఒకరు. ఈయన గతంలో ఇడుక్కి లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వచించారు. కాంగ్రెస్ పార్టేకి చెందిన వీక్షణం పత్రికకు ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

చదవండి : Odisha Congress : విద్యార్థులపై విరిగిన లాఠీ..వెంబడించి మరీ కొట్టారు