కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తోందన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. రాజ్యాంగాన్ని కాపాడతాం అంటూ ఇప్పుడు కాంగ్రెస్ బయలుదేరిందని,అధికారంలోకి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందని యామావతి ప్రశ్నించారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్ లపై ఇవాళ గౌహతిలో రాహుల్ తీవ్ర విమర్శలు చేసిన సమయంలో మాయా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సీఏఏకి వ్యతిరేకంగా ఇవాళ అసోంలో కాంగ్రెస్ రాజ్యాంగ రక్షణ..భారత్ రక్షణ పేరుతో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం నిర్వహించిన సమయంలో మాయా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో, ప్రజల సంక్షేమాన్ని నిర్లక్ష్యంగా విస్మరించినప్పుడు రాజ్యాంగ రక్షణ…భారత్ రక్షణ గురించి ఎందుకు కాంగ్రెస్ ఆలోచించలేదని మాయావతి ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో దళితులు,ముస్లింలు,వెనుకబడిన వర్గాల వాళ్లు పొందాల్సిన రాజ్యాంగహక్కులు పొందలేదని అన్నారు. కాంగ్రెస్ చేసిన ఆ తప్పు కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అంతకుముందు ఓ ట్వీట్ లో… CAA పై డ్రామాలు ప్లే చేసే బదులు కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
ఇవాళ అసోంలో రాహుల్ మాట్లాడుతూ…బీజేపీ ఎక్కడికెళితే అక్కడ విద్వేషమే.ఈశాన్యరాష్ట్రాల సంస్కృతి,చరిత్రను అణిచివేయాలని బీజేపీ నాయకులు అనుకుంటున్నారన్నారు. ఈశాన్య ప్రజల నాడిని బీజేపీ అర్థం చేసెకోలేదన్నారు. అస్సామీ భాష, సంస్కృతిపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దాడిని అనుమతించబోమని రాహుల్ అన్నారు. అస్సాంను నాగపూర్ నడిపించదన్నారు. అస్సాంను అస్సామీలే పాలిస్తారని రాహుల్ తెలిపారు.