Congress
Congress : సంస్థాగత ఎన్నికలకు కాంగ్రెస్ ప్రిపేర్ అవుతోంది. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో.. సుమారు 3 గంటల పాటు కొనసాగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు.. రాష్ట్రాల ఇంచార్జ్‌లు హాజరైన ఈ సమావేశంలో.. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళణ చేసే దిశగా కసరత్తు కూడా చేస్తున్నట్లు సమాచారం.
Read More : Gujarat Election : కాంగ్రెస్‌తో పీకే ? మోదీ ఇలాఖాలో గాంధీ పార్టీని నిలబెడుతారా ?
ఇక.. కేంద్రంపై యుద్ధం చేయాలని కాంగ్రెస్ నేతలు తీర్మానించారు. పోరాటాల ద్వారానే అధికారంలోకి రావాలని యోచిస్తోంది హస్తం పార్టీ. అందుకు దేశంలో ప్రధాన సమస్యగా ఉన్న ధరల పెరుగుదలను ఆయుధంగా చేసుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ధరల పెరుగుదలపై కేంద్రంపై యుద్ధం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఏప్రిల్‌లో దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణను త్వరలోనే ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ.
Read More : Gujarat Election : కాంగ్రెస్‌తో పీకే ? మోదీ ఇలాఖాలో గాంధీ పార్టీని నిలబెడుతారా ?
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అట్టర్‌ఫ్లాప్ అయింది. ఉన్న పంజాబ్‌ను పోగొట్టుకుంది.. మిగతా నాలుగు రాష్ట్రాల్లో పోటీలోనే లేనట్టుగా కనిపించింది. ఈ ఎన్నికల తర్వాత మరోసారి కాంగ్రెస్ నాయకత్వంపై విస్తృతమైన చర్చ జరిగింది. అంతర్గతంగా మరోసారి నిరసన గళం పెరిగింది. ఒక సమయంలో సోనియా గాంధీ పార్టీ అధినాయకత్వాన్ని వదిలిపెడతారనే ప్రచారం కూడా జరిగింది. చివరికి అంతా సద్దుమణిగి.. మళ్లీ మేడమే కంటిన్యూ అయ్యారు. అయితే ఈ పరాజయంపై పోస్టుమార్టమ్ చేశారు హస్తం పార్టీ నేతలు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి వైఖరి కనబరుస్తుందో వేచి చూడాలి.