Sonia Gandhi : బెంగళూరులో ED ఆఫీసు ముందు కారుకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు

నేషనల్ హెరాల్డ్ ఏజేఎల్ మనీ లాండరింగ్ కేసులో సోనియాగాంధీ ED ముందు హాజరయ్యారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ఈడీ టార్గెట్‌ చేసిందని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. దీంట్లో భాగంగా బెంగళూరులోని ఈడీ ఆఫీసు ముందున్న కారుకు నిప్పు పెట్టారు.

Sonia Gandhi..ed investigation

Sonia Gandhi : నేషనల్ హెరాల్డ్ ఏజేఎల్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ముందు హాజరయ్యారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ఈడీ టార్గెట్‌ చేసిందని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఎదుట నిరసన చేపట్టారు. సోనియాకు సంఘీభావం తెలిపేందుకు ఇప్పటికే పార్టీ లీడర్లు, కార్యకర్తలు సోనియా ఇంటివద్దకు చేరుకొని మద్దతు ప్రకటించారు.

దీంట్లో భాగంగా సోనియాగాంధీని ఈడీ విచారించటంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టిన క్రమంలో బెంగళూరులో కూడా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. దీంట్లో భాగంగా బెంగళూరులో ఈడీ ఆఫీసు ముందు నిలిపి ఉన్న ఓ కారుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో ఢీల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ ఆఫీసు వైపుకు దూసుకెళ్లే కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు దూకి కాంగ్రెస్ నేతలు యత్నించారు. దీంతో పోలీసులు వాటర్ కేన్లు ప్రయోగించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు మూడు రైళ్లను అడ్డుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంతో సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

నేషనల్ హెరాల్డ్ – AJL మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు విచారణకు హాజరు కానున్నారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతారు. అయితే రాజకీయ కక్షతోనే కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ఈడీ టార్గెట్‌ చేసిందని  కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ మాత్రం చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని చెప్పుకొస్తోంది.