Nalin kumar kateel: ఆర్ఎస్ఎస్‭ను టచ్ చేస్తే కాంగ్రెస్ బూడిదేనట.. కర్ణాటక బీజేపీ చీఫ్ వార్నింగ్

కర్ణాటకను స్వర్గధామంగా మారుస్తామని హామీ ఇచ్చాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే అది బజరంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్ అని ఏదీ చూడము. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా వెంటనే నిషేధం విధిస్తాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం భజరంగ్‌దళ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌తో సహా ఏ సంస్థనైనా నిషేధిస్తాం

Nalin kumar kateel – BJP : బజరంగ్ దళ్ (Bajrang Dal) సహా ఆర్ఎస్ఎస్ సంస్థలను నిషేధిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పలుమార్లు ప్రకటనలు చేసిన ప్రకటనలపై కర్ణాటక భారతీయ జనతా పార్టీ చీఫ్ నళిని కుమార్ కటీల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ను (RSS) టచ్ చేసే సాహనం చేయకపోతేనే మంచిదని, ఒకవేళ్ అలాంటి ప్రయత్నమే చేస్తే కాంగ్రెస్ బూడిదవుతుందంటూ హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కటీల్ ప్రతిదాడికి దిగారు.

Harish Rao: అందుకే రేవంత్‌కి టీపీసీసీ, బండి సంజయ్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవులు వచ్చాయి: హరీశ్ రావు

‘‘ఆర్ఎస్ఎస్‭ను బ్యాన్ చేస్తామని ప్రియాంక్ ఖర్గే అంటున్నారు. ఈ దేశ ప్రధానమంత్రే ఆర్ఎస్ఎస్‭ స్వయంసేవక్ సభ్యుడు. మేమంతా స్వయంసేవక్‭లమే. జవహార్‭లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నర్సింహారావు లాంటి వారు ఆర్ఎస్ఎస్‭ను నిషేధించాలని చాలా ప్రయత్నించారు. కానీ వాళ్లు విజయం సాధించలేకపోయారు. ఒక్కసారి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ మీద దమ్ముంటే చేయి వేసి చూడండి. కాంగ్రెస్ పార్టీ బూడిద అవుతుంది. ఈ దేశ చరిత్ర తెలుసుకుని మాట్లాడితే మంచిదని ప్రియాంక్ ఖర్గేకి నా సలహా. అలాగే ఆయన నోరు కూడా అదుపులో పెట్టుకోవాలి’’ అని కటీల్ అన్నారు.

Kanhaiya Kumar: బీజేపీ అబద్ధాలకు, దోపిడీకి 9 సంవత్సరాలు నిండింది.. కన్నయ్య కుమార్

దీనికి రెండ్రోజుల ముందు మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఏమాత్రం ఆటంకం ఏర్పడినా బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్‭ సంస్థలను నిషేధిస్తామని హెచ్చరించారు. ఈ చర్యలు బీజేపీ అధినాయకత్వాన్ని ఇబ్బందికి గురి చేసినట్లైతే వారు పాకిస్థాన్‌కు వెళ్లొవచ్చని స్పష్టం చేశారు. ‘‘కర్ణాటకను స్వర్గధామంగా మారుస్తామని హామీ ఇచ్చాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే అది బజరంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్ అని ఏదీ చూడము. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా వెంటనే నిషేధం విధిస్తాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం భజరంగ్‌దళ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌తో సహా ఏ సంస్థనైనా నిషేధిస్తాం. బీజేపీకి ఇది కష్టంగా అనిపిస్తే, పాకిస్తాన్‌కు వెళ్లిపోవచ్చు’’ అని ఖర్గే పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు