Kanhaiya Kumar: బీజేపీ అబద్ధాలకు, దోపిడీకి 9 సంవత్సరాలు నిండింది.. కన్నయ్య కుమార్

అదానీ అభివృద్దే దేశ అభివృద్ధి అనుకుంటున్నారు. రైతులు నిజంగానే అభివృద్ధి అవుతుంటే అమిత్ షా తన కొడుకుని రైతుగా ఎందుకు చేయలేదు? మేక్ ఇన్ ఇండియా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మోదీ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతోంది

Kanhaiya Kumar: బీజేపీ అబద్ధాలకు, దోపిడీకి 9 సంవత్సరాలు నిండింది.. కన్నయ్య కుమార్

9 Years of Modi Govt: బీజేపీ అబద్ధాలకు, దోపిడీకి 9 సంవత్సరాలు నిండిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి కన్నయ్య కుమార్ అన్నారు. దీంతోనే 9 సంవత్సరాల్లో 9 సవాళ్లు అనే పుస్తకాన్ని ఏఐసీసీ తరపున ప్రచురించిందని, మోదీ మాట్లాడిన మాటల్లోనుంచే ఈ 9 సవాళ్లను ప్రశ్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‭లోని గాంధీ భవన్‭లో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Madhya pradesh : మా నాన్నను అరెస్టు చేయండి సార్ అంటూ ఇద్దరు బాలికలు ఫిర్యాదు..

‘‘కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం అనడం కంటే మోదీ ప్రభుత్వం అనడమే కరెక్ట్. 100 రోజుల్లో నల్లధనం బయటకి తీస్తాం అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అన్నారు. అధికారంలోకి వస్తే 100 స్మార్ట్ సిటీలు నిర్మిస్తాం అన్నారు. మహిళల భద్రత ఉంటుంది అన్నారు. 9 ఇండ్లలో మోదీ ప్రభుత్వం ఏం చేసింది? మేం వేసే 9 ప్రశ్నలు కేవలం మా తరపున కాదు. ఇది దేశ ప్రజల తరఫున అడుగుతున్నాం. తప్పులు చేసిన వాళ్ళంతా బీజేపీ వాషింగ్ మెషిన్‭లోకి వచ్చి పవిత్రంగా మారుతున్నారు’’ అని కన్నయ్య అన్నారు.

TDP Mahanadu 2023: జగన్ నోరు తెరిస్తే అబద్ధాలే.. మహానాడులో చంద్రబాబు.. Live Updates

‘‘అదానీ అభివృద్దే దేశ అభివృద్ధి అనుకుంటున్నారు. రైతులు నిజంగానే అభివృద్ధి అవుతుంటే అమిత్ షా తన కొడుకుని రైతుగా ఎందుకు చేయలేదు? మేక్ ఇన్ ఇండియా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మోదీ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతోంది. మోదీ ప్రధాని అయ్యాక పేదవాళ్ళ సంఖ్య పెరిగింది. అదానీ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు ఎవరివో ఎందుకు చెప్పడం లేదు? 9 సంవత్సరాల్లో మోదీ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ప్రధాని కేవలం ప్రధాని మాత్రమే కాదు. ఆయనే రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, హోం మంత్రి, విదేశాంగ మంత్రి. మోదీకి ఏం కావాలనిపిస్తే అది అయిపోతారు’’ అని అన్నారు.

YS Viveka Case: అప్పటివరకు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయొద్దు: తెలంగాణ హైకోర్టు 

‘‘ధరలు పెరుగుతున్నాయని అంటే ధరలు తగ్గించడం ప్రధాని పని కాదని బీజేపీ వాళ్లు అంటున్నారు. బీజేపీ వాళ్లు కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అంటారు కానీ మిత్ర రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్పలేరు. పుల్వామా ఘటనకి ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించినా ప్రభుత్వం వినలేదని చెప్పారు. ఓబీసీ అని చెప్పుకునే ప్రధాని కులగణనని ఎందుకు ఒప్పుకోవడం లేదు? మై పార్లమెంట్ మై ప్రైడ్ అంటున్న మోదీ మన పార్లమెంట్ మన ప్రైడ్ అనలేక పోతున్నాడు. పీఎం కేర్ ఫండ్ పీఎం కోసమే ఏర్పాటు చేశారు. అందుకే వివరాలు బయటకి చెప్పడం లేదు. కరోనా వాక్సిన్ కోసం డబ్బులను పెట్రోల్ రేట్ల నుండి లాగుతున్నారు. మోదీ విశ్వగురువు అయ్యారనే నినాదంతో బీజేపీ ఈసారి ఎన్నికలకు వెళ్తుంది’’ అని కన్నయ్య అన్నారు.