TDP Mahanadu 2023: ఏపీ ఎన్నికల మేనిఫెస్టోను రేపు ప్రకటిస్తాం.. మహానాడులో చంద్రబాబు

మహానాడులో సందడి వాతావరణం నెలకొంది. మోరంపూడి జంక్షన్ వద్ద నుంచి సభా ప్రాంగణం వరకు పసుపు మయంతో రహదారి నిండిపోయింది.

TDP Mahanadu 2023: ఏపీ ఎన్నికల మేనిఫెస్టోను రేపు ప్రకటిస్తాం.. మహానాడులో చంద్రబాబు

TDP Mahanadu 2023

AP TDP: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి వద్ద రెండు రోజులుపాటు టీడీపీ మహానాడు జరగనుంది. తొలిరోజు (శనివారం) ప్రతినిధుల సభ జరుగుతుంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 27 May 2023 05:45 PM (IST)

  • 27 May 2023 05:21 PM (IST)

    రేపు శుభవార్త ప్రకటిస్తాం: నారా లోకేశ్

    మహానాడు వేదికగా రేపు యువతకు శుభవార్త చెబుతామని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. రాయలసీమ అభివృద్ధికి కూడా త్వరలోనే రూట్ మ్యాప్ ప్రకటిస్తామని తెలిపారు.

  • 27 May 2023 04:44 PM (IST)

    మేనిఫెస్టోను రేపు ప్రకటిస్తాం: చంద్రబాబు

    ఏపీ ఎన్నికల టీడీపీ తొలి మేనిఫెస్టోను రేపు ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని చెప్పారు. మహిళలు, రైతులు, యువతకు అధిక ప్రయోజనం చేకూర్చేలా ఎన్నికల మేనిఫెస్టో ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే, దసరా నాటికి పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది.

  • 27 May 2023 01:49 PM (IST)

    టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం తీర్మానాలు చేస్తున్నాం. 1983లో పార్టీ ఆవిర్భావం నాటి సంఘటనలు.. మళ్లీ చూస్తున్నాం. జగన్ పాలనకు చరమగీతం పాడడానికి రేపటి బహిరంగ సభ దోహదం చేస్తుంది.

  • 27 May 2023 01:43 PM (IST)

    రేపటి సభలో చంద్రబాబు ఎన్నికల సందేశం ఇవ్వబోతున్నారు - టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి

    మహానాడు ప్రతినిధుల సభకే అంచనాలు మించి భారీగా వచ్చారు. రాష్ట్రాన్ని హింసావాది చేతుల్లో నుంచి కాపాడుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు సీఎం జగన్ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐకేం అడ్డం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. సీబీఐ లాంటి అతి పెద్ద నేర పరిశోధన సంస్థ అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని జనసేన పవన్ మంచి మనస్సుతో చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న పవన్ కామెంట్లతో జగన్‌కు నిద్ర పట్టడం లేదు. ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ జెండాలు కడతారా..? వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. రేపటి సభలో చంద్రబాబు ఎన్నికల సందేశం ఇవ్వబోతున్నారు.

  • 27 May 2023 01:37 PM (IST)

    మహానాడు వేదికపై నుంచి బీదా రవిచంద్ర యాదవ్ జారి పడ్డారు. స్టేజీ‌పై కుర్చీల వెనుక ఖాళీ గుర్తించక జారి కిందకు పడిపోయాడు. అతనికి స్వల్ప గాయాలు అయ్యాయి. మహానాడు వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స తీసుకుని, కొద్దిసేపటి తరువాత తిరిగి కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • 27 May 2023 01:32 PM (IST)

    రూ. 2వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయి - చంద్రబాబు

    రూ. 2వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దుకు టీడీపీ కట్టుబడి ఉంది. టీడీపీ అధికారం ఉంటే సంక్షేమం తెలుసు, సంపద సృష్టి తెలుసు. అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టింది టీడీపీనే. పేదలకు ఫించన్లివ్వడం మొదలు పెట్టింది టీడీపీనే. టీడీపీ విజన్ ఏంటో హైదరాబాద్ చూస్తే తెలుస్తుంది. ఇరిగేషన్‌కు రూ.64 వేల కోట్లు ఖర్చుపెట్టాం. నాలుగేళ్ల క్రితం కొత్తగా వచ్చాడు. ఒక్క ఛాన్స్ అన్నాడు. కోడి కత్తి అన్నాడు.. డ్రామా ఆడాడు.. రాష్ట్రాన్ని నాశనం చేయడం ప్రజా వేదిక నుంచే ప్రారంభించాడు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారంటూ సీఎంజగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

  • 27 May 2023 01:02 PM (IST)

    జగన్ నోరు తెరిస్తే అబద్దాలే-టీడీపీ అధినేత చంద్రబాబు

    నాలుగేళ్లల్లో రూ. 2.47 కోట్ల అవినీతి జరిగింది. సంపద దోపిడీ ఎక్కువ. ధరల బాదుడు ఎక్కువ. స్కాముల్లో మాస్టర్ మైండ్ జగన్. జగన్ నోరు తెరిస్తే అబద్దాలే. కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలే. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకున్నారు.

  • 27 May 2023 12:34 PM (IST)

    మా దగ్గర ఓ పిచ్చొడు.. మీ దగ్గర ఓ సైకో ఉన్నాడు - టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్

    బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించింది ఎన్టీఆర్. ఎన్టీఆర్‌ది ఆత్మగౌరవ నివాదం.. చంద్రబాబుది ఆత్మ విశ్వాసం నినాదం. ఇవే టీడీపీకి శ్రీరామ రక్ష. చంద్రబాబు విజన్2020 పెట్టినప్పుడు పుట్టని పిల్లలకు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు. తాము ఇప్పుడు చేసుకుంటున్న ఉద్యోగాలు చంద్రబాబు విజన్ అని తెలుసుకుని సంతోషిస్తున్నారు. మా దగ్గర ఓ పిచ్చొడు.. మీ దగ్గర ఓ సైకో ఉన్నాడు.

  • 27 May 2023 12:30 PM (IST)

    జగన్‌ను తరమికొట్టే రోజులు దగ్గరికొచ్చాయి - టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

    అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీది ప్రజాపక్షమే. 2019లో ఓ దొపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారు. టీడీపీని ఎదుర్కొలేక కోడి కత్తి డ్రామా, సొంత బాబాయిని చంపి ప్రజల సింపతితో జగన్ సీఎం అయ్యారు. సీఎం జగన్ను.. వేటాడి వెంటాడి తరిమి కొట్టే రోజులు వచ్చాయి. 151 స్థానాలు రావడంతో జగన్‌కు కళ్లు నెత్తికెక్కాయి, ఒళ్లు మదమెక్కింది. ఇంత అనుభవమున్న పార్టీ అయినా సరే గత నాలుగేళ్లల్లో ఎన్నో కష్టాలు పడ్డాం. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలను టీడీపీ గెలుచుకోవడం ఖాయం.

  • 27 May 2023 11:44 AM (IST)

    మహానాడు‌కు పోటెత్తిన టీడీపీ శ్రేణులు

    మహానాడుకు టీడీపీ శ్రేణులు పోటెత్తారు. తొలిరోజు 15వేల మందికే ఆహ్వానాలు పంపించారు. అయితే, అన్ని ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరావటంతో మహానాడు పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి. భారీగా వాహనాలు రావడంతో.. సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ, మరికొందరి ముఖ్య నేతల వాహనాలు రహదారులపై ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాయి. ధవళేశ్వరం, వేమగిరి, బొమ్మూరు, మోరoపూడి, దివాన్ చేరు ప్రాంతాల్లోని రహదారుపై ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది.

  • 27 May 2023 11:22 AM (IST)

    మహానాడు సభ ప్రాంగణానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. సభ ప్రాంగణంలో సభ్యత్వ నమోదు చేసుకున్నారు. రక్తదాన శిబిరంలో ప్రతినిధులతో చర్చించి ఫోటో గాలరీ ఏర్పాట్లను చంద్రబాబు పర్యవేక్షించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు.

  • 27 May 2023 10:55 AM (IST)

    ‘జనహృదమై నారా లోకేష్’ అంటూ యువగళం పాదయాత్రపై కేశినేని చిన్ని ముద్రించిన పుస్తకాన్ని కార్యకర్తలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

  • 27 May 2023 10:53 AM (IST)

    మహానాడులో ప్రతినిధుల నమోదు కేంద్రం వద్ద లోకేశ్ తన పేరు నమోదు చేసుకున్నారు. గుంటూరు జిల్లా ప్రతినిధుల నమోదు కేంద్రంలో లోకేశ్ తన పేరు నమోదు చేయించుకున్నారు.

  • 27 May 2023 10:51 AM (IST)

    మహానాడు ప్రాంగణంలో లోకేష్ సందడి..

    మహానాడు ప్రాంగణంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ సందడి చేశారు. పార్టీ ప్రతినిధులకు అభివాదం చేస్తూ, వారి వద్దకు వెళ్లి పలుకరించారు. ప్రతినిధుల నమోదు దగ్గర లోకేశ్ ఘంటాను కలిశారు.ఇదిలాఉంటే లోకేశ్‌తో సెల్ఫీల కోసం టీపీడీ కార్యకర్తలు పోటీ పడటం కనిపించింది.

  • 27 May 2023 10:47 AM (IST)

    టీడీపీ మహానాడులో నోరూరించే వంటకాలు..

  • 27 May 2023 10:37 AM (IST)

    పొత్తులపై క్లారిటీ ఇచ్చే అవకాశం..

    మహానాడు‌లో చేసిన తీర్మానాలు, భవిష్యత్ కార్యాచరణ ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తారు. ఈ క్రమంలో ఆయన పొత్తులపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

  • 27 May 2023 10:35 AM (IST)

    మరికొద్ది సేపట్లో మహానాడు ప్రతినిధుల సమావేశం ప్రారంభమవుతుంది. తీర్మానాలపై ఉదయం 11 నుంచి సాయంత్రం 6:30 వరకు చర్చ జరుగుతుంది. తీర్మానాలపై చర్చ అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది.

  • 27 May 2023 10:30 AM (IST)

    తొలిరోజు కార్యక్రమాల షెడ్యూల్ ఇలా..

    - ఉదయం 8 గంటల నుండి 10గంటలకు వరకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం.
    - ఉదయం 10గంటలకు ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్
    - 10.30 గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభం.
    - 10:45కి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రముఖులతో జెండా ఆవిష్కరణ.
    - 10.50కి జ్యోతి ప్రజ్వలన, ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి.
    - 11 గంటల నుండి 11.30 వరకు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై టీడీపీ ముఖ్య నేతలచే ప్రసంగాలు, సందేశాలు.
    - 11.30 నుండి 12.15 వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభ ఉపన్యాసం.
    - మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రముఖుల ప్రసంగాలు.
    - మధ్యాహ్నం 2.30 వరకు భోజన విరామం.
    - 2.30 నుండి 3 గంటల వరకు తెలంగాణ తీర్మానాలు.
    - 3 గంటల నుండి సాయంత్రం 6.30 వరకు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖుల ప్రసంగాలు.
    - 6.30 నుండి రాత్రి 7 గంటల వరకు రాజకీయ తీర్మానం.
    - రాత్రి 7గంటలకు అధ్యక్షులు ఎన్నిక ముగింపు ప్రసంగం ఉంటుంది.
    - రాత్రికి సభా ప్రాంగణం వద్దే చంద్రబాబు నాయుడు, లోకేష్ బస చేయనున్నారు.

  • 27 May 2023 10:28 AM (IST)

    అధికారమే లక్ష్యంగా మహానాడులో రాజకీయ తీర్మానాలు ..

  • 27 May 2023 10:27 AM (IST)

    ప్రతినిధుల సభలో ఏపీకి చెందిన 15 అంశాలపై సభలో తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్నారు. తెలంగాణవి ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చిస్తారు.

  • 27 May 2023 10:26 AM (IST)

    పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు కమిటీ..

    ప్రతినిధుల సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఎన్నిక నిర్వహణకు కమిటీని నియమిస్తూ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఉదయం 10గంటల నుంచి ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అవసరమైతే 4-6 గంటల మధ్య ఓటింగ్ నిర్వహించి, ఏడు గంటలకు ఫలితాలు ప్రకటిస్తారు.

  • 27 May 2023 10:23 AM (IST)

    మహానాడు వద్ద ప్రతినిధుల నమోదు ప్రక్రియ ప్రారంభం‌మైంది. జిల్లాల వారీగా ప్రతినిధుల నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ఉదయం నుంచే కౌంటర్ల వద్ద పార్టీ శ్రేణులు కిక్కిరిస్తున్నారు.

  • 27 May 2023 10:18 AM (IST)

    మహానాడు ప్రాంగణానికి ప్రతినిధులు చేరుకుంటున్నారు. జిల్లాల వారీగా ప్రతినిధులు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. భారీగా వస్తున్న వాహనాలతో మహానాడు సమీపంలోని రహదారులు రద్దీగా మారాయి. మోరంపూడి జంక్షన్ వద్ద నుంచి సభా ప్రాంగణం వరకు పసుపు మయంతో రహదారి నిండిపోయింది.