Congress : సీడబ్ల్యూసీ సమీక్ష స్టార్ట్.. నాయకత్వ మార్పు ఉంటుందా ?

గతంలో లాగానే ఫలితాలపై మరోక సమీక్ష కమిటీని సోనియా ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. గత సంవత్సరం మేలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుపై వేసిన కమిటీ...

Cwc

CWC Meeting : ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఓటమిపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ ఢిల్లీలో భేటి జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఘోర పరాజయానికి కారణాలు, భవిష్యత్తు వ్యూహాలు వంటి కీలక అంశాలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు చర్చిస్తారు. సోనియాగాంధీ నేతృత్వంలో సాయం త్రం 4 గంటలకు జరిగే ఈ కీలక సమావేశానికి గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌శర్మ సహా ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ పదవులకు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గుడ్‌బై చెప్తారని టాక్ గుప్పుమంది. ముగ్గురి రాజీనామా వార్తలను కాంగ్రెస్ అధికారికంగా ఖండించింది. చివరిసారిగా గత సంవత్సరం అక్టోబర్ 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. మరలా 2022, మార్చి 13వ తేదీ ఆదివారం ఈ సమావేశం జరుగనుంది. సీడబ్ల్యూసీ (CWC) సమావేశానికి 57 మందికి ఆహ్వానం అందింది.

Read More : AICC : రాజీనామా యోచనలో రాహుల్ ? ప్రియాంక, సీడబ్ల్యూసీ భేటీలో వెల్లడి ?

గతంలో లాగానే ఫలితాలపై మరోక సమీక్ష కమిటీని సోనియా ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. గత సంవత్సరం మేలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుపై వేసిన కమిటీ, అది సమర్పించిన నివేదికకే దిక్కు లేకపోతే ఇక ఇప్పుడు సీడబ్ల్యూసీ సమావేశం, మరో కమిటీ వేసి ఏం లాభమని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 20 మధ్యలో జరగాల్సిన పార్టీ అధ్యక్ష ఎన్నికలను ముందుకు జరిపే అవకాశం ఉందని సమాచారం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లేదా ఇతర నేతలు పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పలువురు CWCలో ప్రతిపాదన చేసే అవకాశం ఉంది. జీ 23 గ్రూప్‌ నేతలు.. నాయకత్వ మార్పు కోరుకుంటుంటే గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉండే వారంతా రాజీనామాల అవసరం లేదని చెబుతున్నారు.

Read More : CWC Meeting : G-23 ఎఫెక్ట్..త్వరలో సీడబ్యూసీ భేటీ!

జీ 23 గ్రూపు నేతలు విరుచుకుపడితే తిప్పికొట్టేందుకు అన్ని స్థాయిల్లోనూ రాహుల్ సన్నిహిత నేతలు సిద్ధమయ్యారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని రాహుల్ గాంధీని పలువురు నేతలు కోరనున్నారు. తాత్కాలికంగా మరో సీనియర్ నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పడం మంచిందని మరికొందరు నేతలు వెల్లడిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో రాహుల్, ప్రియాంక భుజాన వేసుకొని ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఎక్కడా చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేకపోయాయి. యూపీలో ప్రియాంక పూర్తిగా రంగంలోకి దిగినా….ఘోర పరాజయం తప్పలేదు. ఇక పంజాబ్‌లో రాహుల్ గాంధీ సుడిగాలి ప్రచారం చేసినా అధికారానికి దూరమైంది. ఇక మిగతా రాష్ట్రాల్లో కోలుకోలేని స్థితికి చేరింది. దీంతో ఇవాళ్టి మీటింగ్‌లో ఏం తేల్చనున్నారనేది ఆసక్తి నెలకొంది.