కల్లు తాగితే కరోనా రాదంటున్న BSP లీడర్

Consuming ‘Taadi’ in Large Quantities Can Prevent Covid-19 : కరోనా (Corona) ప్రపంచాన్ని ఇంకా వణికిస్తోంది. దీనిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఇప్పిటికే పలు దేశాల్లో స్టార్ట్ అయ్యింది కూడా. భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో..కొంతమంది లీడర్స్ విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. గోమూత్రం తీసుకోవడం వల్ల కరోనా రాదని పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా..ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన BSP (Bahujan Samaj Party) నాయకుడు కరోనాను ఖతం చేసేందుకు కొత్త చిట్కా చెప్పారు. కల్లుతో కరోనాను తరిమికొట్టవచ్చంటున్నారు బహుజన్ సమాజ్ పార్టీ నేత భీమ్ రాజ్ భర్ (Bheem Rajbhar).
బల్లియా జిల్లా రాస్రా (Rasra area)లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కల్లుకు రోగ నిరోధక శక్తి ఉందని చెప్పుకొచ్చిన ఆయన..గంగానది (Ganga river) కంటే స్వచ్చమైందిగా అభివర్ణించారు. కల్లును ఎక్కువగా తాగడం వల్ల కరోనా నుంచి దూరంగా ఉండొచ్చని, రాజ్ భర్ సమాజంలో పిల్లలు దీనిని తాగుతారన్నారు. గతంలో కరోనా నివారణ, కట్టడికి సంబంధించి పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు గోమూత్రం తీసుకోవడం ద్వారా..కరోనా మహమ్మారికి చెక్ పెట్టొచ్చని ఓ బీజేపీ నేత చేసిన కామెంట్లు దుమారం రేపాయి. కరోనా విషయంలో అనవసరమైన కామెంట్స్ చేసి గందరగోళంలో పడవేయవద్దని కొందరు సూచించారు. ప్రస్తుతం బీఎస్పీ లీడర్ చేసిన కామెంట్స్ ఎలాంటి దుమారం రేపుతాయో చూడాలి.