సంక్రాంతి సందడి : జల్లికట్టు షురూ..

  • Published By: veegamteam ,Published On : January 1, 2019 / 07:26 AM IST
సంక్రాంతి సందడి : జల్లికట్టు షురూ..

తమిళనాడు : సంక్రాంతి అంటే తమిళనాడులో ముందుగా గుర్తుకొచ్చేది జల్లికట్టు. డిసెంబర్ నెలలోనే సంక్రాంతి మాసం అయిన ధనుర్మాసం ప్రారంభం అయిపోతుంది. అప్పటి నుండి ప్రారంభమయ్యే సంక్రాంతి వేడుకలు జనవరి నెల రాగానే ఇంకాస్త ఊపందుకుంటాయి. తమిళనాడులోతీ అరియలూరు జిల్లా సాత్తాన్ కుప్పంలో జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బసవన్నలు ఉత్సాహంతో పరుగులు పెడతుంటే..వాటిని అదుపు చేసి పోటీ గెలిచేందుకు యువకులు కూడా అంతే జోష్ తో పాల్గొనే పండుగే జల్లికట్టు. వందలాది ఎద్దులు..వాటిని అదుపు చేసేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ పోటీలను తిలకించేందుకు వేలాది మంది తరలిరావడంతో సందడి వాతావరణం కనిపిస్తుంది.
జనవరి 2న విరుద్ నగర్ జిల్లాలో జల్లికట్టు పోటీలు ప్రారంభం కానున్నాయి. జల్లికట్టును నిషేధించాలని గత కొంతకాలంలో జల్లికట్లును నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటీషన్స్ వేయటం..సంప్రదాయాలను అనుసరిస్తునే..సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలు విధించింది.  ఈక్రమంలో ఎద్దులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సుప్రీంకోర్టు నిబంధలను అతిక్రమించకుండా ఈ వేడుకలను జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎస్పీ గుప్తా కోరారు.