బైక్‌కు మంటలు : కాపాడిన పోలీసులు..నెటిజన్ల ప్రశంసలు

హైవైపై ఓ బైక్ రయ్యి రయ్యిమంటూ దూసుకెళుతోంది. బైక్‌పై దంపతులతో పాటు ఓ చిన్నారి కూడా ఉంది. బైక్‌కి ఏం జరిగిందో తెలియకుండానే ప్రయాణం చేస్తున్నారు వారు.

  • Publish Date - April 16, 2019 / 11:26 AM IST

హైవైపై ఓ బైక్ రయ్యి రయ్యిమంటూ దూసుకెళుతోంది. బైక్‌పై దంపతులతో పాటు ఓ చిన్నారి కూడా ఉంది. బైక్‌కి ఏం జరిగిందో తెలియకుండానే ప్రయాణం చేస్తున్నారు వారు.

హైవైపై ఓ బైక్ రయ్యి రయ్యిమంటూ దూసుకెళుతోంది. బైక్‌పై దంపతులతో పాటు ఓ చిన్నారి కూడా ఉంది. బైక్‌కి ఏం జరిగిందో తెలియకుండానే ప్రయాణం చేస్తున్నారు వారు. ఆ సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం వెళుతోంది. బైక్‌పై వెళుతున్న వీరిని హెచ్చరించారు. వారికి ఏం అర్థం కాలేదు. చివరకు ఛేజింగ్ చేసి బైక్‌ని ఆపారు. తమను ఎందుకు ఆపారో అప్పటికీ వారికి అర్థం కాలేదు. చివరకు విషయం తెలిసి పోలీసులకు థాంక్స్ చెప్పారు. 
Read Also : ఇక పోదాం పదండీ : చంద్రుడిపై నీళ్లు ఉన్నాయి

ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం ఆగ్రా – లక్నో జాతీయ రహదారిపై ఓ వ్యక్తి బైక్‌పై వెళుతున్నాడు. బైక్ వెనుక మహిళతో పాటు చిన్నారి కూడా ఉంది. బైక్‌కు ఓ పక్కన బ్యాగ్ తగిలించి ఉంది. స్పీడుగా ప్రయాణిస్తుండడంతో సైలెన్సర్ వేడెక్కి..బ్యాగుకు మంటలు అంటుకున్నాయి. బైక్ నడుపుతున్న వ్యక్తి గమనించకుండా వేగంగా వెళుతున్నాడు. గాలికి మంటలు మరింత ఎక్కువయ్యాయి.  
Read Also : మహిళను ఈడ్చుకెళ్లిన మెట్రో రైలు : తలకు తీవ్రగాయాలు

ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించారు. అలర్ట్ అయ్యారు. బైక్‌ని ఛేజింగ్ చేశారు. వాహనంలో నుండే వారిని హెచ్చరించారు. బైక్‌పై వెళుతున్న వారికి ఏం అర్థం కాలేదు. అలాగే ముందుకెళ్లి  పోతున్నారు. వీరిని ఆపడానికి పోలీసులు 4 కిలో మీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వచ్చింది. చివరకు కొద్ది దూరం ముందుకు వెళ్లిన పోలీసులు బైక్‌ని జాగ్రత్తగా ఓ పక్కకు ఆపివేసి దూరంగా వెళ్లాలని సూచించారు. అనంతరం బ్యాగును మెల్లిగా పక్కకు తీసి మంటలను ఆర్పివేశారు.

పోలీసులు చూసి రక్షించారు..లేకపోతే పరిస్థితి ఏంటని ఆ దంపతులు హఢలిపోయారు. ఘటనకు సంబంధించి ఒకరు దీనిని వీడియో తీశారు. క్షణాల్లో ఇది వైరల్ అయ్యింది. పోలీసులు స్పందించిన తీరుపై నెటిజన్లు అభినందనలు తెలియచేస్తున్నారు. 

Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్