corona virus
COVID-19 Cases: దేశంలో కరోనా వైరస్ (Corona virus) వ్యాప్తి పెరుగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల (positive cases) సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. పలు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ (Central Health Department) సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 5,880 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల (active cases) సంఖ్య 35,199కి చేరింది. ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) XBB.1.16 వల్ల దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
Covid 19 cases: దేశంలో భారీగా తగ్గిన రోజువారీ కరోనా కేసులు.. కొత్తగా 2,468 మందికి పాజిటివ్
ఫిబ్రవరిలో 21 శాతంగా ఉన్న XBB.1.16 వేరియంట్ కేసులు, మార్చి నెలలో 32శాతానికి పెరిగాయి. తాజాగా నమోదైన కొత్త కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,47,56,616 కు చేరింది. మరణాల సంఖ్య 5,30,979కి చేరింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.39శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,726మంది. గత 24గంటల్లో మొత్తం 205 డోస్‌ల వ్యాక్సిన్‌ను అందించారు. దీంతో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 220,66,23,527 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను అందించారు.
COVID 19: దేశంలో కొత్తగా 6,168 కరోనా కేసులు.. 22,40,162 డోసుల కరోనా వ్యాక్సిన్ల వినియోగం
దేశంలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, యుపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. యూపీలో ఆదివారం ఒక్కరోజే 319 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 1,192గా ఉంది. మరోవైపు ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 699 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో బాధపడుతున్న నలుగురు మరణించారు.