Covid 19 cases: దేశంలో భారీగా తగ్గిన రోజువారీ కరోనా కేసులు.. కొత్తగా 2,468 మందికి పాజిటివ్

దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. దేశంలో కొత్తగా 2,468 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు నిన్నటి కంటే 1,280 తగ్గి 33,318కి చేరాయని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,01,934కి చేరిందని వివరించింది. నిన్న దేశంలో 17 మంది కరోనా కారణంగా మృతి చెందినట్లు చెప్పింది.

Covid 19 cases: దేశంలో భారీగా తగ్గిన రోజువారీ కరోనా కేసులు.. కొత్తగా 2,468 మందికి పాజిటివ్

india corona cases

Covid 19 cases: దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. దేశంలో కొత్తగా 2,468 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు నిన్నటి కంటే 1,280 తగ్గి 33,318కి చేరాయని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,01,934కి చేరిందని వివరించింది. నిన్న దేశంలో 17 మంది కరోనా కారణంగా మృతి చెందినట్లు చెప్పింది.

దేశంలో ఇప్పటివరకు కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 528,733కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. నిన్న దేశంలో 2,90,216 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 218,83,40,816కు చేరినట్లు చెప్పింది. కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,40,39,883కు చేరిందని వివరించింది. నిన్న కరోనా నుంచి 3,731 మంది కోలుకున్నట్లు తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..