24గంటల్లో దాదాపుగా 49వేల కేసులు, 757 మరణాలు.. భారత్‌లో కరోనా కల్లోలం

  • Publish Date - July 25, 2020 / 10:16 AM IST

భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 48,916 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 757 మంది మరణించడంతో మృతుల సంఖ్య 31వేల 358కి పెరిగింది. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 13లక్షల 36వేల 861కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షల 56వేల 071. కోలుకున్న వారి సంఖ్య 8లక్షల 49వేల 432. నిన్న(జూలై 24,2020) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4లక్షల 20వేల 898 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది. నిన్న ఒక్కరోజే 34వేల 602 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని, ప్రస్తుతం అది 2.38శాతంగా ఉందని చెప్పింది.