Corona Update: దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా.. 12రాష్ట్రాల్లో 51 డెల్టా ప్లస్ కేసులు

భారతదేశంలో చురుకైన కరోనా కేసుల సంఖ్య 6 లక్షల కంటే తగ్గాయి. అమెరికా మరియు బ్రెజిల్ తరువాత, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో క్రియాశీల కేసులు నమోదవగా.. భారతదేశం కంటే ఎక్కువ కరోనా కేసులు బ్రెజిల్‌లో నమోదవుతూ ఉన్నాయి.

Coronavirus Cases in India Today 26 June: భారతదేశంలో చురుకైన కరోనా కేసుల సంఖ్య 6 లక్షల కంటే తగ్గాయి. అమెరికా మరియు బ్రెజిల్ తరువాత, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో క్రియాశీల కేసులు నమోదవగా.. భారతదేశం కంటే ఎక్కువ కరోనా కేసులు బ్రెజిల్‌లో నమోదవుతూ ఉన్నాయి. భారత్‍‌లో కంటే ఎక్కువగా మరణాలు ఆ దేశంలో వస్తున్నాయి. గత ఐదు రోజుల్లో రెండోసారి భారతదేశంలో 50వేల కన్నా తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో 48,698 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,183 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు జూన్ 21న 42,640 కేసులు తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో, గత 24 గంటల్లో 64,818 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో వైపు యాక్టివ్‌ కేసుల సంఖ్య దిగి వస్తుంది. ప్రస్తుతం 5,90,391కు చేరాయి.

దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,01,82,619కు చేరగా.. 2,91,85,391 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 3లక్షల 94వేల 525 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మరణాల రేటు 1.31 శాతం కాగా, రికవరీ రేటు 97 శాతంకి పెరిగింది. యాక్టివ్ కేసులు 2 శాతంగా ఉన్నాయి. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. మొత్తం సోకిన వారి సంఖ్య ప్రకారం భారతదేశం రెండవ స్థానంలో ఉంది.

కరోనా సంక్రమణ ప్రస్తుత పరిస్థితి:
మొత్తం కరోనా కేసులు- మూడు కోట్ల ఒక లక్షా 83వేల 143కేసులు
కోలుకున్నవారు – రెండు కోట్ల 91 లక్షలు 93 వేల 85మంది
మొత్తం క్రియాశీల కేసులు – 5 లక్షల 95వేల 656మంది
చనిపోయినవారు – మూడు లక్షల 94 వేల 493మంది
దేశంలో వరుసగా 44వ రోజు, కరోనా కేసుల కంటే ఎక్కువ రికవరీలు నమోదవుతూ ఉన్నాయి. జూన్ 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 31కోట్ల 50 లక్షల కరోనా వ్యాక్సిన్‌లు ఇచ్చినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది చివరి రోజు 61 లక్షల 19 వేల వ్యాక్సిన్‌లు ఇవ్వగా.. అదే సమయంలో ఇప్పటివరకు 40 కోట్ల కరోనా పరీక్షలు జరిగాయి. చివరి రోజున సుమారు 17 లక్షల కరోనా నమూనా పరీక్షలు జరిగాయి. పాజిటివిటీ రేటు 3 శాతానికి పైగా ఉంది.

డెల్టా ప్లస్ వేరియంట్:
దేశంలో ఇప్పటివరకు 45వేల జన్యు నమూనాలలో, కోవిడ్ -19 డెల్టా ప్లస్ వేరియంట్లు 12 రాష్ట్రాల్లో నమోదయ్యాయని, మొత్తం 51మంది బాధితులకు డెల్టా ప్లస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఇందులో 22 కేసులు మహారాష్ట్ర నుంచి రాగా.. డెల్టా ప్లస్ కేసులు తమిళనాడులో 9, మధ్యప్రదేశ్లో 7, కేరళలో 7, పంజాబ్‌లో 3, గుజరాత్‌లో 2, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హర్యానా మరియు కర్ణాటకలలో ఒకటి నమోదయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు