Corona Second Wave: ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్ల చోరీ.. విచారణకు ఆదేశాలు!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో రోజుకి వేలల్లో కేసులు నమోదుతుండడంతో ప్రభుత్వాలు కట్టడి చర్యలు తీసుకుంటుంది. మరోవైపు కరోనాతో ఆసుపత్రులలో చేరిన రోగులకు పలు రాష్ట్రాలలో సౌకర్యాల కొరత వేధిస్తుంది.

Corona Second Wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో రోజుకి వేలల్లో కేసులు నమోదుతుండడంతో ప్రభుత్వాలు కట్టడి చర్యలు తీసుకుంటుంది. మరోవైపు కరోనాతో ఆసుపత్రులలో చేరిన రోగులకు పలు రాష్ట్రాలలో సౌకర్యాల కొరత వేధిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో కోవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా కనిపిస్తుంది. మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతూ రోగులు ఆసుపత్రులకు పరుగులు తీస్తుండటంతో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది. రెండు రోజుల క్రితం షాదోల్‌ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ప్రాణవాయువు‌ కొరతతో ఆరుగురు రోగులు మృతిచెందగా మృతుల బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు.

మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులలో సైతం ఆక్సిజన్ కొరతతో ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా నడుస్తుంది. ఇదే అదునుగా కొందరు దుండగులు ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల దోపిడీకి పాల్పడ్డారు. తాజాగా దామో జిల్లా ఆసుపత్రిలో కొందరు దుండగలు ఆక్సిజన్‌ సిలెండర్లను దోపిడీ చేశారు. గతంలోనూ ఇలా జరిగినట్లు ఆరోపణలు రాగా అధికారులు పెద్దగా పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. అయితే.. ఈసారి కలెక్టర్‌ రంగంలోకి దిగి ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇప్పటికే నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లే బ్లాక్ లో అమ్మడం, కొనడం.. ఏకంగా సిలిండర్లనే చోరీ జరుగుతుందంటే ఇక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

Read: Corona Drug: కరోనాకు టాబ్లెట్ వచ్చేస్తుంది.. ఒక్కరోజులోనే మహమ్మారి ఖతం!

ట్రెండింగ్ వార్తలు