Corona Third Wave : మార్చి నాటికి కరోనా థర్డ్‌వేవ్ తగ్గుముఖం- ఐసీఎంఆర్

దేశంలో మార్చి ఆరంభం నాటికి కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ లో థర్డ్ వేవ్ తీవ్రత గరిష్టానికి చేరిందని.. ఫిబ్రవరి చివరికి..

Corona Third Wave

Corona Third Wave : కరోనా థర్డ్ వేవ్ గురించి ఐసీఎంఆర్ అడిషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమిరన్ పాండా ఊరటనిచ్చే విషయం చెప్పారు. దేశంలో మార్చి నెల ఆరంభం నాటికి కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ లో థర్డ్ వేవ్ తీవ్రత గరిష్టానికి చేరిందని.. ఫిబ్రవరి చివరి నాటికి అక్కడ కేసులు తగ్గిపోతాయని వెల్లడించారు. జనవరి చివర్లో దేశంలో రోజువారీ కరోనా కేసులు 2లక్షలకు పైగా నమోదవగా.. క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో కరోనా తీవ్రతపై ఆందోళన వీడుతోంది. అయితే, కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

రానున్న మూడు నాలుగు వారాల్లో దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడు వస్తున్న కేసుల్లో 90శాతం ఒమిక్రాన్, 10శాతం డెల్టా వేరియంట్ కేసులు ఉంటున్నాయి. రోజువారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం అని నిపుణులు అంటున్నారు.

Mukesh Ambani: భారత్ లోనే అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ

అటు దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న‌ దేశంలో 1,27,952 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, క‌రోనా నుంచి 2,30,814 మంది కోలుకున్నార‌ని వివరించింది.

క‌రోనా కార‌ణంగా నిన్న 1,059 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం 13,31,648 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 5,01,114కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతం పెరిగింది. వినియోగించిన‌ క‌రోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 1,68,98,17,199కు చేరింది.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో థర్డ్ వేవ్ కు కారణమైంది. ఒమిక్రాన్ కు వేగంగా వ్యాపించే లక్షణం ఉంది. దీంతో ఒక్కసారిగా లక్షల సంఖ్యలో కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత రోజువారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది.

కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో దేశంలో థర్డ్‌ వేవ్‌ గరిష్ఠ స్థితి దాటినట్లేనా అన్న ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానమిచ్చింది. వేవ్‌, పీక్‌ వంటి పదాలను పక్కనబెడితే.. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు, పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే దేశవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్నట్లే కన్పిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు

ఒమిక్రాన్‌ ప్రభావంతో జనవరి నెలలో దేశంలో కోవిడ్‌ థర్డ్ వేవ్ ఉద్ధృతి స్పష్టంగా కనిపించింది. నిత్యం పెరుగుతూ వెళ్లిన కొవిడ్‌ కేసులు, జనవరి 21వ తేదీ నాటికి 3 లక్షల 47 వేలకు చేరింది. ఈ వేవ్‌లో రోజువారీ కేసుల్లో అదే గరిష్ఠం. అప్పటి నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఫిబ్రవరి 3 నాటికి ఆ సంఖ్య లక్షా 72 వేలకు పడిపోయింది. ఇదే సమయంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు దాదాపు 18 శాతం నుంచి 11 శాతానికి చేరింది. దీంతో దేశంలో థర్డ్‌వేవ్‌ ప్రభావం గరిష్ఠ స్థితి దాటినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొన్ని రోజులు ఇదే విధంగా ఉంటే వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లేనని అభిప్రాయపడుతున్నారు.

ఇక, ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ కాస్త తక్కువ తీవ్రత కలిగినట్లు ఇప్పటివరకు వచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటికి గల కారణాలను విశ్లేషించే పనిలో నిమగ్నమైన నిపుణులు.. వైరస్‌ గుణం కంటే వాటిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ప్రజల్లో అధికంగా ఉండడమే కారణమనే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన శాస్త్రవేత్తలు, సాధ్యమైనంత త్వరగా ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలకు కరోనా వ్యాక్సిన్లను అందించే ప్రయత్నం చేయాలని సూచించారు.

ఇన్‌ఫెక్షన్‌కు గురైన వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి స్థాయికి సంబంధించిన అంశాల వల్లే ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 2021 చివరి నాటికి దక్షిణాఫ్రికా ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవడమో లేదా అంతకుముందు వేవ్‌లలో వైరస్‌కు గురై ఉండవచ్చని అంచనా వేశారు. ఇలా గతంలో ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం వల్లే ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రత తక్కువగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతోపాటు రీ-ఇన్‌ఫెక్షన్‌కు గురిచేసే సామర్థ్యం ఒమిక్రాన్‌కు తక్కువగా ఉండడం వల్లే లక్షణాలు తక్కువగా కనిపిస్తూ ఉండవచ్చని అన్నారు.