కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లు రక్తదానం చేయొచ్చా? : NBTC ఏం చెబుతోంది?

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లు రక్తదానం చేయొచ్చా? : NBTC ఏం చెబుతోంది?

Corona Vaccinated Person Can Donate Blood (1)

Updated On : March 22, 2021 / 3:48 PM IST

corona vaccinated person can donate blood : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేయటానికి వ్యాక్సిన్ వచ్చేసింది. దీన్ని ప్రజలు వేయించుకంటున్నారు కూడా. అలా కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు కొత్త కొత్త అనుమానాలు వస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లు ఎటువంటి ఫుడ్ తినాలి? ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లు రక్తదానం చేయొచ్చా? చేయకూడదా? మద్యం తాగొచ్చా? తాగకూడదా? ధూమపానం చేయొచ్చా?.. ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఇటువంటి సందేహాలకు National Blood Transfusion Council (NBTC) క్లారిటీనిచ్చింది.

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. కొనసాగిస్తున్నాయి. మొదటగా కరోనా సమయంలో ముందుండి పోరాడిన యోధులకు వ్యాక్సిన్ వేశారు. ఆ తర్వాత ఇతర విభాగాల వారికి..ఆ తరువాత సామాన్య ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు ఎలాంటి పనులు చేయాలి? ఏమేం పనులు చేయకూడదన్నదానిపై ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్తదానం విషయంలో మరింత అనుమానాలకు దారితీస్తోంది. దీనిపై జాతీయ రక్తదాన మండలి (NBTC)) క్లారటీ ఇచ్చింది.

కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న వాళ్లు రక్త దానం చేయొచ్చా? అనే ప్రశ్న అందరికీ వస్తోంది. ఈ విషయమై తాజాగా జాతీయ రక్తదాన మండలి కీలక ప్రతిపాదనలు చేసింది. రెండో డోసు తీసుకున్న 28 రోజలు వరకు రక్తదానం చేయొద్దని సూచించింది. అంటే మొదటి డోసు తీసుకున్న 56 రోజుల వరకు రక్తదానం చేయడానికి వీల్లేదన్నమాట. రెండో డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత మాత్రమే వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు తయారవుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ గతంలోనే వెల్లడించింది.

అలాగే మందుబాబులకు ఇదో పెద్ద చిక్కొచ్చిపడినట్లుగా ఫీలైపోతున్నారు. కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న వాళ్లు మద్యం తాగొచ్చా? ధూమపానం చేయొచ్చా? అన్న వాటిపై కూడా పలు అనుమానాలు ఉన్న క్రమంలో వాటికి కూడా కేంద్ర వైద్యాధికారులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు మద్యపానం చేసినా, ధూమపానం చేసినా టీకా ప్రభావం తగ్గుతోందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు.