మన దేశంలో కరోనా పాజిటవ్ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రోజు వారి హాజరు పట్టికను బయో మెట్రిక్ విధానంనుంచి మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగులు బయోమెట్రిక్ విధానంలో కాకుండా పాతకాలం నాటి రిజిష్టర్ విధానంలో సంతకం చేసి విధులకు హాజరు కావాలని సూచించింది. అక్టోబరు31 వరకు ఈ విధానం అమలులో ఉంటుంది.
బయోమెట్రిక్ విధానం వల్ల కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వార్తలు వచ్చినందును ఉద్యోగులు మార్చి 31 వరకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఎబిఎఎస్) లో బయోమెట్రిక్ హాజరు ఉపయోగించకుండా తమ ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని అన్ని మంత్రిత్వ శాఖలు కేంద్రాన్ని కోరాయి. దేశంలో తక్కువ సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదైనప్పటికీ వైరస్ యొక్క స్వభావాన్ని, దాని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
See Also | శని త్రయోదశి రోజు ఇలా చేయండి..మీ కష్టాలన్నీ తొలగి పోతాయి