కరోనా హాట్‌స్పాట్స్: 62 జిల్లాల్లోనే 80శాతం కరోనా కేసులు

  • Publish Date - April 6, 2020 / 11:31 AM IST

భారతదేశం మొత్తంమీద 274 జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు బైటపడ్డాయి. మిగిలిన జిల్లాలు సేఫ్. దేశంలోని జిల్లాలు 736.  మొత్తం కరోనా కేసుల్లో 80శాతం కేసులు కేవలం 62 జిల్లాల కోటాయే. మిగిలిన జిల్లాలో అక్కడక్క కరోనా కేసులున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ను ఎత్తివేసినా, ఈ జిల్లాల్లో లాక్‌డౌన్ కంటిన్యూ అవుతుందని అంటున్నాయి ఉన్నతస్థాయి వర్గాలు.

ఇప్పటిదాకా 274 జిల్లాల్లో కరోనా పాజిటివ్  కేసులు నమోదయ్యాయి.  దేశంలో ఇప్పటిదాకా 4,315 కేసుల్లో 328 మందికి నయమైతే 118 మంది చనిపోయారు. అంటే మరణాల శాతం 2.7.  మొత్తం కేసుల్లో రికవరీ రేటు 7.6శాతం. ఇంతవరకు దేశంలో ఒక్కరు కూడా ICUల్లోకూడా లేరు.  అదే మార్చి 30నాటికి  కేసులు 1,251 ఐతే, 32 మంది చనిపోయారు.  

కరోనా కొన్ని ప్రాంతాల్లోనే చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. వీటిని హాట్ స్పాట్‌గా పిలుస్తున్నారు. అంటే 62 జిల్లాలే కరోనా కేంద్రాలు. అందుకే ఈ జిల్లాలను నిర్భందించి, కరోనా కట్టడి కోసం ప్రయత్నిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. టెస్టింగ్ లు పెరిగాయి. రెండు రోజుల్లోనే రెండింతలయ్యాయి. వచ్చే వారంలో టెస్టింగ్‌ల సంఖ్య రెండింతలు కానుంది.(సహజీవనం పేరుతో ఎంజాయ్…. పెళ్ళనే సరికి పరార్)

కరోనా కేసులు ఎక్కువగా నమోదువుతున్న ఈ 62 జిల్లాల సరిహద్దులను మూసేసి, కట్టుదిట్టంగా దిగ్బందించారు. ఈ నిర్భంధాన్నే అనధికారికంగా  “Bhilwara model”అని కేంద్రం పేరు పెట్టింది. గాల్లోకూడా కరోనా వ్యాపిస్తోందన్న వాదనలకు సరైన రుజులు లేవని Indian Council of Medical Research (ICMR) తేల్చేసింది.

personal protective equipment (PPE)లు చాలావరకు అందుబాబులో వచ్చాయి. మొదట్లో పిపిఈలు లేక రెయిన్ కోట్లేసుకొని డాక్టర్లు కరోనా పేషెంట్లకు చికిత్సచేశారన్న విమర్శలొచ్చాయి. అందుకే ప్రభుత్వం త్వరపడింది. దేశీయంగా PPE తయారీకి అనుమతిచ్చిన తర్వాత ఒకేసారి వేల కొద్ది అందుబాటులోకి రావడంతో దేశవ్యాప్తంగా పంపిణీ మొదలుపెట్టారు. విదేశాల నుంచి PPEలను దిగుమతికూడా చేసుకొంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు