చరిత్రలో తొలిసారిగా…OPD సర్వీసులను షట్ డౌన్ చేసిన ఎయిమ్స్

చరిత్రలో తొలిసారిగి ఢిల్లీ AIIMS(ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) OPD సర్సీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. స్పెషాలిటీ మరియు అన్నీ కొత్త మరియు ఫాలో అప్ పేషెంట్ రిజిస్ట్రేషన్ తో సహా ఓపీడీ సర్వీసులను నిరవధికంగా షట్ డౌన్ చేయాలని ఇవాళ ఎయిమ్స్ నిర్ణయించింది. ఈ ఆర్డర్ మార్చి-24,2020నుంచి అమలులోకి వస్తుందని AIIMS తెలిపింది.

అంతకుముందు, కరోనావ్యాప్తిని నియంత్రించడానికి దాని వనరులను మళ్ళించటానికి వీలుగా… మార్చి 23 నుండి రోగుల సాధారణ వాక్-ఇన్ OPD నమోదును తాత్కాలికంగా నిలిపివేయాలని ఎయిమ్స్ నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ లో . స్పెషాలిటీ మరియు అన్నీ కొత్త మరియు ఫాలో అప్ పేషెంట్ రిజిస్ట్రేషన్ తో సహా అన్నీ ఓపీడీ సర్వీసులను నిరవధికంగా షట్ డౌన్ చేయాలని నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్నీ సెంటర్లు మూసివేయబడి ఉంటాయని సోమవారం(మార్చి-23,2020)జారీ చేసిన సర్క్యులర్ లో ఎయిమ్స్ తెలిపింది.

ప్రధానత్య లేని అన్నీ ఎలిక్టివ్ ప్రొసీజర్స్ మరియు శస్త్రచికిత్సలను వాయిదా వేస్తూ గత శుక్రవారం ఎయిమ్స్  ఒక సర్క్యులర్ జారీ చేసింది.  అయితే ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ సర్జరీలకు మాత్రం దీనికి మినహాయింపు ఇచ్చింది.  కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఆర్‌ఎంఎల్, సఫ్దర్‌జంగ్ వంటి ఆస్పత్రులు అన్ని అనవసరమైన ఎలిక్టివ్ ప్రొసీజర్స్ మరియు శస్త్రచికిత్సలను వాయిదా వేసుకున్నాయి. ఒపిడిలు పరిమితం చేయబడిన పద్ధతిలో నిర్వహించబడుతున్నాయి.