పూణెలో దంపతులకు కరోనా నిర్ధారణ!..రెండు నెలలకు బైటపడింది!!

  • Publish Date - March 10, 2020 / 05:07 AM IST

మహారాష్ట్రలోని పూణెలో కరోనా వైరస్‌కు సంబంధించిన మొదటిసారే రెండు కేసులు ఒకేసారి నమోదయ్యారు. పూణెకు చెందిన భార్యా భర్తలకు కరోనా వైరస్ సోకినట్టు పరీక్షల్లో వెల్లడయ్యిందని ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. వీరిద్దరూ జనవరి ఒకటిన దుబాయ్ నుంచి పూణెకు వచ్చారు.

పూణెలోని ఒక ట్రావెల్ ఎజెన్సీ ద్వారా దుబాయ్ టూర్ కు వెళ్లి వచ్చారు. అలా వచ్చిన కొన్నినెలల వరకూ కూడా వీరిలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. అంటే జనవరి నుంచి ఇప్పటివరకూ వీరికి  ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. అంటే ఇప్పటికే రెండు నెలలు గడిచిన ఈ క్రమంలో వారిలో కరోనా లక్షణాలు బైటపడటంతో అనుమానంతో హాస్పిటల్ కు వెళ్లి టెస్ట్ లు చేయించుకోవటంతో బైటపడింది.  

దీంతో వీరు పూణెలోని నాయుడు ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరి నుంచి సేకరించిన రక్త నమూనాలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. రిపోర్టులో పాజిటివ్ అని తేలడంతో నాయుడు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కాగా భారత్‌లో ఇప్పటి వరకూ 47 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

See More | ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు..నిరోధక చర్యలపై బులిటెన్ విడుదల