Corona India Update: దేశంలో కేరళలోనే ఎక్కువగా కరోనా కేసులు

దేశంలో కొత్తగా కరోనా సోకిన రోగుల సంఖ్య పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది.

Corona Cases: దేశంలో కొత్తగా కరోనా సోకిన రోగుల సంఖ్య పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,451 కొత్త కరోనా కేసులు నమోదవగా.. ఇదే సమయంలో కొత్తగా 266 మంది మరణించారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కరోనా కేసులు కాస్త పెరిగాయి. నవంబర్ 7వ తేదీన దేశవ్యాప్తంగా 10వేల 853కొత్త కేసులు నమోదవగా.. ఇదే సమయంలో 526 మంది చనిపోయారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో మొత్తం కరోనా సోకిన రోగుల సంఖ్య 3,43,66,987కి చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం కరోనా సోకిన 4లక్షల 61వేల 57మంది మరణించారు. గత 24 గంటల్లో దేశంలో 13వేల 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో, ఇప్పటివరకు మొత్తం 3,37,63,104 మంది రోగులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,42,826 యక్టీవ్ కేసులు ఉండగా.. దేశంలో 0.42 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రోజువారీ సానుకూలత రేటు గత 35 రోజుల కంటే 2 శాతం తక్కువగా ఉంది. రికవరీ రేటు 98.24 శాతానికి చేరుకుంది, ఇది మార్చి 2020 తర్వాత అత్యధికం. కరోనా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఎక్కువగా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వ్యాక్సిన్లు వేయించుకున్నవారి సంఖ్య 1,08,47,23,042కి చేరుకుంది.

ఇక దేశవ్యాప్తంగా వచ్చిన కేసుల్లో కేరళలో 7,124 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 21 మంది మరణించారు. ఒక్కరోజులో 7,488 మంది రోగులు కోలుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు