Corona New Cases: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. భయపెట్టేస్తున్న ఒమిక్రాన్!
దేశంలో కరోనా కేసులు మరోసారి ప్రజలను భయపెట్టేస్తున్నాయి.

Virus Corona 11zon 11zon
Corona New Cases: దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాకతో.. కరోనా మరోసారి ప్రజలను భయపెట్టడం ప్రారంభించింది. Omicron ముప్పు నేపధ్యంలో కేసులు దేశంలోనూ పెరుగుతూ ఉన్నాయి. అయితే, శనివారంతో పోలిస్తే ఆదివారం కొత్త కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 6 వేల 987 కరోనా కేసులు నమోదు కాగా.. ఇదే సమయంలో 162 మంది మరణించారు.
దేశంలో మొత్తం యాక్టివ్ కరోనా రోగుల సంఖ్య 76 వేల 766 కి చేరకుంది. కాగా, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 3 కోట్ల 42 లక్షల 30 వేల 354కి పెరిగింది. ఈ మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటివరకు 4 లక్షల 79 వేల 682 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటివరకు 141 కోట్ల 30 లక్షల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందజేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
456ఒమిక్రాన్ కేసులు:
దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 456కి చేరుకుంది.
15నుంచి 18ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్:
ఒమిక్రాన్ ముప్పుతో కరోనా మూడో వేవ్ వచ్చేందుకు అవకాశం ఉంది అన్నట్లు వస్తున్న నిపుణుల అభిప్రాయాల మధ్య, వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 15-18 సంవత్సరాల మధ్య వయస్సు వారికి వ్యాక్సిన్ వేయనున్నట్లు PM మోడీ శనివారం ప్రకటించారు. దీనితో పాటు జనవరి 10వ తేదీ నుంచి వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది సలహాల మేరకు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్ల పైబడినవారికి ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్‌లను వేయనున్నారు.
DNA ఆధారిత వ్యాక్సిన్:
కోవిడ్‌కు వ్యతిరేకంగా నాసికా వ్యాక్సిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి DNA ఆధారిత వ్యాక్సిన్ కూడా త్వరలో భారతదేశంలో ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు.