Indians middle class : 3 కోట్ల మంది మధ్యతరగతి బతుకులను చిదిమేసిన మాయదారి కరోనా

Coronavirus Pandemic, 3 Crore Indians, India’s Middle Class, Crores Indians Out Of Middle Class

Indians out of middle class  : మాయదారి కరోనా మధ్యతరగతి బతుకులను చిదిమేసింది. కరోనా కరోనా సంక్షోభంతో మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. కరోనా దెబ్బకు ఆర్థిక కష్టాల్లో కురుకుపోయారు. భారత్‌లో మధ్య తరగతిపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపించిందని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ పేర్కొంది. దాదాపు 3.2 కోట్ల మంది మధ్య తరగతి నుంచి దిగువకు పడిపోయారని నివేదికలో వెల్లడించింది.

నివేదిక ప్రకారం.. గత ఏడాదిలో కరోనా సమయంలో రోజుకు రూ. 724 (10 డాలర్లు) నుంచి రూ.1449 (20 డాలర్లు) వరకు సంపాదించేవారంత తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 3.2 కోట్ల మంది తమ సంపాదన కోల్పోవాల్సి వచ్చింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుపేదలుగా మారిపోయారు.

కరోనా సంక్షోభం రాకముందు రూ.9.9 కోట్ల మంది మధ్యతరగతి వారి ఆదాయం ఏడాదిలోనే రూ.6.6 కోట్లకు తగ్గిపోయింది. 2011–19 మధ్య కాలంలో దాదాపుగా రూ.5.7 కోట్ల మంది మధ్య తరగతికి చేరారు. రోజుకి రూ.140 లేదా అంతకంటే తక్కువ సంపాదన ఉన్న వారు 7.5 కోట్ల మందికి చేరుకున్నారు.