×
Ad

PM Modi: మీ కౌంట్‌డౌన్ మొదలైంది, తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు- డీఎంకేపై ప్రధాని మోదీ ఫైర్

డీఎంకే సర్కార్ లో ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతోందన్నారు. డీఎంకే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విరుచుకుపడ్డారు.

Pm Modi Representative Image (Image Credit To Original Source)

 

  • డీఎంకే ముక్త్ తమిళనాడు మా సంకల్పం
  • డీఎంకే సర్కార్ లో ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతోంది
  • సంక్షేమం పేరుతో అవినీతికి పాల్పడింది

PM Modi: తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. డీఎంకే పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తమిళనాడులో ఉన్నది డీఎంకే సర్కార్ కాదు సీఎంసీ సర్కార్ అని ప్రధాని మోదీ విమర్శించారు. సీఎంసీ అంటే కరప్షన్, మాఫియా, క్రైమ్ అని ప్రధాని మోదీ అభివర్ణించారు.

డీఎంకే సర్కార్ లో ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతోందన్నారు. డీఎంకే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విరుచుకుపడ్డారు. డీఎంకే ముక్త్ తమిళనాడు మా సంకల్పం అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తమిళ ప్రజలను డీఎంకే మోసం చేసిందని ఆరోపించారు. చెన్నై సమీపంలోని మధురాంతకంలో భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. డీఎంకే లక్ష్యంగా నిప్పులు చెరిగారు.

“తమిళనాడులో ఇప్పుడు ప్రజాస్వామ్యంతో, జవాబుదారీతనంతో సంబంధం లేని ప్రభుత్వం ఉంది. డీఎంకే ప్రభుత్వం ఒక కుటుంబానికి మాత్రమే సేవ చేస్తోంది. ఎవరైనా పార్టీలో ఎదగాలంటే, వారికి మూడు లేదా నాలుగు మార్గాలు మాత్రమే ఉన్నాయి. వంశపారంపర్యత, అవినీతి, మహిళలను దుర్వినియోగం చేయడం లేదా మన సంస్కృతిని దుర్వినియోగం చేయడం” అంటూ మండిపడ్డారు ప్రధాని మోదీ. డీఎంకే చీఫ్ స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు.

”కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమిళనాడు అభివృద్ధికి అపూర్వమైన కృషి చేసింది. 2014 కి ముందు కాంగ్రెస్, డీఎంకేలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. వారు తమిళనాడుకు కేటాయించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ నిధులు ఎన్డీయే సర్కార్ కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ ఇతర వెనుకబడిన వర్గాల సంక్షేమం పేరుతో డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. రైతులు, మత్స్యకారుల అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇస్తున్నా. స్టాలిన్ ప్రభుత్వ హయాంలో మాదకద్రవ్యాలు, మద్యం మాఫియాలు అభివృద్ధి చెందాయి.

డీఎంకేలోని వ్యక్తులు డ్రగ్ మాఫియాతో చేతులు కలిపారన్న ఆరోపణలున్నాయి. ఎన్డీఏకు అనుకూలంగా మీరు వేసే ప్రతి ఓటు తమిళనాడును మాదకద్రవ్యాల ముప్పు నుండి విముక్తి చేయడానికి వేసే ఓటు అవుతుంది. తమిళ ప్రజలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ఓటు వేయాలి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో.. రెండింటిలోనూ ఎన్డీయే అధికారంలో ఉంటుంది. ఇది పెట్టుబడులను ఆకర్షించడంలో సాయపడుతుంది” అని తమిళ ఓటర్లకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.

Also Read: టాక్స్ పేయర్లలో టెన్షన్ టెన్షన్.. 2026 బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 1 లక్ష చేస్తారా? ఇదే జరిగితే ఉద్యోగులకు పండగే..!