Hijab Controversy : దేశమా, మతమా ఏది అత్యున్నతమైంది ? మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగానికి చెందిన రంగరాజన్‌ నరసింహన్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Hijab Controversy : కర్ణాటకలో హిజబ్‌ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. లిస్టింగ్‌ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఈ క్రమంలో…కర్ణాటకలో హిజబ్‌ వివాదంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశమా లేక మతమా.. ఏది అత్యున్నతమైందంటూ ప్రశ్నించింది. ఆలయాల్లోకి హిందూయేతరులను నిషేధించాలని కోరుతూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారించింది.

Read More : Ramesh varma : స్టేజిపైనే హీరోయిన్‌కి సారీ చెప్పిన ఖిలాడీ డైరెక్టర్

ఈ సందర్భంగా దేశంలో కొన్ని శక్తులు డ్రెస్‌ కోడ్‌కు సంబంధించిన వివాదాలను లేవనెత్తుతున్నాయనీ.. ఇది దేశమంతా పాకుతోందంటూ అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది.. ఒకరు హిజబ్ కోసం, మరికొందరు టోపీ కోసం.. ఇంకొందరు ఇతర అంశాల కోసం వెళ్తున్నారు… ఇది ఒక దేశమా లేదంటే మత ప్రాతిపదికన విభజించబడిందా? అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. భారతదేశం లౌకిక దేశమనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్న సీజే.. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలు మతం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు.

Read More : IND vs WI: భారత్, వెస్టిండీస్ మూడో ODI.. రెండు జట్లలో Probable XI వీళ్లే!

తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగానికి చెందిన రంగరాజన్‌ నరసింహన్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో భక్తులకు డ్రెస్‌కోడ్‌ను ఖచ్చితంగా అమలు చేయాలంటూ పిటిషనర్‌ ఈ పిల్‌లో న్యాయస్థానాన్ని కోరారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లోకి హిందూయేతరులు అడుగు పెట్టకుండా, దేవాలయాల ప్రాంగణంలో వాణిజ్య కార్యకలాపాలను నిషేధించాలంటూ ఆదేశాలివ్వాలని కోరారు. ఈ సందర్భంగా పిటిషనర్‌ ధోరణిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది.

ట్రెండింగ్ వార్తలు