Jacqueline Fernandez: మనీ లాండరింగ్ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. ఆమె మధ్యంతర బెయిల్‌ను వచ్చే నెల 10 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
India: తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు.. రెండేళ్ల కనిష్టానికి పడిపోయిన భారత విదేశీ నిల్వలు
సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై అభియోగాలు నమోదు చేసింది. గతంలో సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ సన్నిహితంగా మెలిగింది. ఈ సందర్భంగా రూ.7 కోట్ల విలువైన నగల్ని సుఖేష్.. జాక్వెలిన్‌కు బహుమతిగా అందించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అలాగే జాక్వెలిన్‌తోపాటు ఆమె కుటుంబ సభ్యులకు ఖరీదైన కార్లు, వాచీలు వంటివి కూడా బహుమతిగా ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సుఖేష్ చంద్రశేఖర్ అవినీతి కేసులో జాక్వెలిన్ ప్రమేయంపై కూడా అధికారులు కేసు నమోదు చేశారు. గత ఆగష్టు 17న ఆమె పేరును కూడా చార్జిషీటులో చేర్చారు.
Jharkhand: స్కూటీపై వెళ్తున్న యువతి కిడ్నాప్… అత్యాచారానికి పాల్పడ్డ పది మంది
ఈ అంశంపై గత సెప్టెంబర్‌లో ఢిల్లీ పోలీసులు జాక్వెలిన్‌ను ప్రశ్నించారు. దాదాపు ఎనిమిది గంటలపాటు ఆమెను ప్రశ్నించారు. ఈ సందర్భంగా జాక్వెలిన్.. తాను ఆరు నెలల పాటు సుఖేష్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు అంగీకరించింది. అయితే, అతడు చేసే లావాదేవీలు, కార్యకలాపాల గురించి తనకేం తెలియదని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రస్తుతం సుఖేష్ జైల్లో ఉన్నాడు. అయితే, జాక్వెలిన్ మత్రం అరెస్టు కాకుండా బెయిల్ తెచ్చుకుంది. దీన్ని పొడిగిస్తూ తాజాగా ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.