కోవాగ్జిన్ సరఫరాకు భారత్‌ బయోటెక్‌ నిరాకరణ..ఢిల్లీలో మూతబడిన వ్యాక్సినేషన్ సెంటర్లు

ఢిల్లీకి తగినన్నీ వ్యాక్సిన్‌ మోతాదులు సరఫరా చేసేందుకు కోవాగ్జిన్‌ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ నిరాకరించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా బుధవారం తెలిపారు

Covaxin ఢిల్లీకి తగినన్నీ వ్యాక్సిన్‌ మోతాదులు సరఫరా చేసేందుకు కోవాగ్జిన్‌ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ నిరాకరించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా బుధవారం తెలిపారు. దీంతో ఢిల్లీలోని కోవాగ్జిన్ సెంటర్లను మూసివేసినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఢిల్లీ ప్రభుత్వం 1.34 కోట్ల డోసులు అంటే కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ 67 లక్షల చొప్పున సరఫరా చేయాలని రెండు వ్యాక్సిన్‌ సంస్థలను కోరామని తెలిపారు. అయితే తాము మోతాదులను పంపలేమని ప్రభుత్వానికి భారత్‌ బయోటెక్‌ తెలిపిందని అన్నారు. సంబంధిత ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు సరఫరా చేస్తున్నందున వీటిని అందిచలేమని చెప్పినట్లు సిసోడియా పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత్‌ బయోటెక్‌ ఇలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. సరఫరాను నిలిపివేయడంతో 17 స్కూల్స్‌లో ఏర్పాటు చేసిన‌ వంద‌ కోవాక్సిన్ టీకా కేంద్రాల‌ను బ‌ల‌వంతంగా మూసివేయాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. కోవాగ్జిన్‌ టీకాలు అందించలేమని తమకు లేఖ రాశారని, తొలుత కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలనుగుణంగా ఇస్తామని, అధికారుల ఆదేశాల కన్నా ఎక్కువ ఇవ్వలేమని ఇప్పుడు పేర్కొంటున్నారని చెప్పారు. అదేవిధంగా ఇతర దేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేయడం కేంద్ర ఆపాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు 76 దేశాల‌కు 6.6 మిలియ‌న్ డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపింద‌ని, ఇది అది పెద్ద త‌ప్పు అని సిసోడియా ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు