కోవిడ్-19 నిభందనలు ఉల్లంఘించిన 600 మంది తల్లిదండ్రులపై కేరళ పోలీసులు కేసు బుక్ చేశారు. తిరువనంతపురంలోని రెండు స్కూల్స్ లో జరిగిన కేరళ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెడికల్ (KEAM) ప్రవేశ పరీక్షకు హాజరైన ఈ 600 మంది తల్లిదండ్రులు సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
పరీక్షలు జరిగిన రోజు జూలై 16 న కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కేరళ ఎపిడెమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్ కింద కేసులు నమోదయ్యాయి.
మరోవైపు, ఈ సంఘటన గురించి తెలిసి తాను షాక్ అయ్యానని తిరువనంతపురం ఎంపి శశి థరూర్ తన ఫేస్ బుక్ పేజీలో రాశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని తాను, విద్యార్థి సంఘం,ప్రభత్వాన్ని కోరామని,అయితే ప్రభుత్వం తెలివితక్కువగా ముందుకెళ్లి పరీక్ష నిర్వహించిందని, గత 48 గంటల్లో పరీక్షకు హాజరైన చాలా మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలిందని శశిథరూర్ తెలిపారు.
ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చడానికి పౌరులకు వ్యతిరేకంగా పోలీసు కేసులు పెడుతోందని శశిథరూర్ ఆరోపించారు. కేసులను ఉపసంహరించుకోవాలని అయన ప్రభుత్వాన్ని కోరారు.