ఢిల్లీలోని రెడ్,ఆరెంజ్ జోన్లలో భారీ శానిటైజేషన్ డ్రైవ్

సోమవారం నుంచి రెడ్ జోన్లు,ఆరెంజ్ జోన్లలో ఢిల్లీలో భారీ శానిటైజేషన్ డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం(ఏప్రిల్-12,2020)ప్రకటించారు. దేశ రాజధానిలో కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్లను రెడ్ జోన్లు,హై రిస్క్ జోన్లను,ఆరెంజ్ జోన్లుగా తాము డిక్లేర్ చేసినట్లు కేజ్రీవాల్ తెలిపారు.

 ఢిల్లీ ప్రభుత్వం తెలిపిన ప్రకారం మొత్తం 43హాట్ స్పాట్ లు కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించబడ్డాయి. ఇవాళ ఆన్ లైన్ ద్వారా కేజ్రీవాల్ మాట్లాడుతూ దేశరాజదానిలో మరికొన్ని కంటైన్మెంట్ జోన్లను గుర్తించినట్లు తెలిపారు. ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలపై ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ ప్రజలకు భరోసా ఇచ్చారు.

కాగా,దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన రెండవ రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. ఢిల్లీలో ఇప్పటివరకు 1069 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో 500కి పైగా కేసులు తబ్లిగీ జమాత్ సభ్యులవే. 

See Also | చైనా సూపర్ పవర్ కావాలనే కుట్ర చేసిందా? ప్రపంచాన్ని కరోనాతో భయపెట్టి డ్రాగన్ చేసిన వ్యాపారం చూస్తే కళ్లు తిరిగిపోతాయ్!

ట్రెండింగ్ వార్తలు