Covid-19 Guidelines : ఢిల్లీ NCRలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. స్కూళ్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు..!

Covid-19 Guidelines : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. NCR ప‌రిధిలో కరోనా కేసుల తీవ్రత అధికంగా కనిపిస్తోంది.

Covid-19 Guidelines : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. NCR ప‌రిధిలో కరోనా కేసుల తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ప్రధానంగా పాఠ‌శాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఢిల్లీ, నోయిడాల్లో కరోనా బారినపడుతున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, వసంత్ కుంజ్ ప్రైవేట్ స్కూళ్లలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన మూడు రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పాఠశాలల్లో 50 పైగా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం పాఠశాలల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేయనుంది. కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, కోవిడ్ నిబంధలను కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది.

ఒక్క విద్యార్థి లేదా ఒక్క టీచర్ కు కరోనా సోకినా స్కూల్ మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వీలైనంత వరకు సామాజిక దూరాన్ని పాటించాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సూచించింది. పాఠశాల కోసం కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేయాలని మనీష్ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో కరోనా కేసులు నమోదైతే.. డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు తెలియజేయాలని, ఆ పాఠశాలను తాత్కాలికంగా మూసివేయాలని సూచించింది. కరోనా కేసులు పెరిగితే ఫోర్త్ వేవ్ ఖాయమని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.

Covid 19 Guidelines Delhi Govt To Issue Covid 19 Guidelines For Schools Amid Surge In Cases 

అందుకే ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, శానిటైజర్లను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు, సహాయక సిబ్బంది తల్లిదండ్రులకు కోవిడ్ నివారణ గురించి అవగాహన కల్పించాలని సూచనలు చేస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా తెలిపారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగానే ఉందని, మరణాల సంఖ్య కూడా తక్కువగానే ఉందని ప్రజలు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేజ్రీవాల్ సూచించారు.

Read Also : Covid Xe Variant : కొత్త రూపంలో కరోనా..ఈ లక్షణాలను గుర్తించండి..అప్రమత్తమవ్వండి

ట్రెండింగ్ వార్తలు