దేశంలో కొత్తగా 15,413 కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు

  • Published By: vamsi ,Published On : June 21, 2020 / 06:25 AM IST
దేశంలో కొత్తగా 15,413 కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు

Updated On : June 21, 2020 / 6:25 AM IST

దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అయితే కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న ప్రజల గ్రాఫ్ కూడా వేగంగా పెరుగుతోంది. దేశంలో మొత్తం 4,10,461 మంది రోగులు ఉన్నారు, వీరిలో ఇప్పటివరకు 2.27 లక్షల మందికి నయమైంది. 1.69 లక్షల క్రియాశీల కేసులు మిగిలి ఉన్నాయి. ఇప్పటివరకు 13,254 మంది చనిపోయారు

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో గరిష్టంగా 15,413 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో 306 మంది మరణించారు.

కరోనా వైరస్ సంక్రమణ పెరుగుతున్న కేసుల మధ్య టెస్టింగ్‌లు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్) ప్రకారం, గత 24 గంటల్లో సుమారు 1,90,730 మందిని పరీక్షించారు.

ఇప్పటివరకు 66,07,226 మందికి పైగా పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం, మొత్తం 953 ప్రయోగశాలలలో (699 ప్రభుత్వ మరియు 254 ప్రైవేట్) కరోనా వైరస్ రోగులను పరీక్షిస్తున్నారు.

Read: జీతాల ఆలస్యంపై కలత చెందుతున్న కోవిడ్ యోధులు