Covid-19: ఇండియా కరోనా ఫోర్త్ వేవ్‌ను ఎదుర్కోనుందా..!

దేశంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉన్నట్లుండి కేసుల సంఖ్య ఒక్కసారిగా బారీగా పెరిగింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో 3,4 రోజులుగా 81 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

Covid-19: ఇండియా కరోనా ఫోర్త్ వేవ్‌ను ఎదుర్కోనుందా..!

Covid In India..mask Must

Updated On : June 14, 2022 / 8:30 AM IST

Covid-19: దేశంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉన్నట్లుండి కేసుల సంఖ్య ఒక్కసారిగా బారీగా పెరిగింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో 3,4 రోజులుగా 81 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కసారిగా పెరుగుతున్న కేసుల సంఖ్యను బట్టి చూస్తే ఫోర్త్‌వేవ్‌లోకి అడుగుపెట్టినట్టుగానే భావించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెండు వారాలుగా పెరుగుతున్న కేసులతో అప్రమత్తం కావాలంటూ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్‌ పరీక్షలు ఎక్కువ సంఖ్యలో జరపాలంటూ ఆదేశించడంతో పాటు.. ఇన్‌ఫ్లుయెంజా వంటి అనారోగ్యాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లపై అప్రమత్తంగా ఉండాలని టెస్ట్‌ శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని ఆదేశించింది.

భారతదేశంలో అక్కడక్కడా పెరుగుతున్న కేసులతో పాటు హైదరాబాద్‌లోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వర్షాకాలం మొదలవుతున్న తరుణంలో ఈ అంశం భయాందోళనలో ముంచేస్తోంది.

Read Also : తెలంగాణలో కరోనా కల్లోలం.. మరోసారి వందకు పైనే కేసులు

ఒమిక్రాన్‌ వేగంతోనే సమస్య
కరోనా వేరియంట్లన్నింటిలో ఒమిక్రాన్ వ్యాప్తి చాలా వేగవంతం. ఈ క్రమంలో బీఏ.2 వేరియంట్ జనవరిలో పెను బీభత్సం సృష్టించింది. అందరినీ పలకరించిపోయింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మరణాల రేటు తక్కువగానే ఉన్నా.. చాలా మందిని అనారోగ్యానికి గురిచేసింది.

ఇప్పుడు మరో సబ్‌ వేరియెంట్‌ ‘బీఏ.2.12.1’అనేది యూఎస్‌లో బయటపడి మరో అలజడికి కారణం కానుంది. గతంలోని ఒమిక్రాన్‌ సబ్‌వేరియెంట్ల కంటే కూడా ఇది 25 శాతం ఎక్కువ ఇన్ఫెక్షన్‌ కలుగజేస్తోంది. ఒమిక్రాన్‌ బారిన పడినవారు ఈ సబ్‌వేరియెంట్‌తో మరోసారి ఇన్ఫెక్షన్‌ బారినపడే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

కామన్ లక్షణాలు:

రెండు, మూడురోజులుగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులు.. వేసవి సెలవులకు ఛార్‌దామ్, ఈశాన్య రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు తిరిగి వచ్చినవారిలో అనారోగ్యానికి ఎక్కువగా గురవుతున్నారు. రోజూ వచ్చే పేషెంట్లు 10, 20 మందిలో ఒకటి లేదా రెండు పాజిటివ్‌ కేసులొస్తున్నాయి. ఎక్కువమందిలో గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, హైఫీవర్, డయెరియా వంటి గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ లక్షణాలు, కడుపు ఉబ్బరం, మలబద్ధకం తదితర సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు.

థర్డ్‌వేవ్‌లో మాదిరిగా ఇప్పుడు నమోదవుతున్న కేసులు కూడా.. పారాసిటమాల్, దగ్గుమందులతోనే తగ్గిపోతున్నాయి. అక్కడక్కడా కనిపిస్తున్న సీరియస్ కేసులు భయంలో ముంచెత్తుతున్నాయి. ముంబై, ఢిల్లీ వంటి చోట్లా కేసులు పెరుగుతున్నందున కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.