అయ్యో..దేవుడా:వెంటిలేటర్ ప్లగ్ పీకి కరోనా పేషంట్ ను చంపేసిన బంధువులు..!!

  • Publish Date - June 19, 2020 / 10:54 AM IST

కరోనా సోకి హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న పేషెంట్  కుటుంబ సభ్యలు చేసిన నిర్వాకానికి అతడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వెంటిలేటర్ ప్లగ్ ను పీకేయటంతో కరోనా పేషెంట్ చనిపోయాడు. ఇదివాళ్లు కావాలని చేశారా? లేదా పొరపాటున జరిగిందా అనేదానిపై విచారణ జరుగుతోంది.

వివరాల్లోకి వెళితే..రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో ఓ కరోనా బాధితుడు మహారావు భీమ్‌సింగ్ (ఎంబీఎస్‌) హాస్పిటల్ లో వెంటిలేటర్‌పై ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని చూడటానికి కుటుంబ సభ్యులు వచ్చారు. అలా వచ్చినవాళ్లు తమతోపాటు ఓ చిన్నపాటి కూలర్‌ తెచ్చారు. పేషెంట్స్ విజిటింగ్ అవర్స్ లో అతన్ని చూడటానికి లోపలికి వెళ్లారు. 

అలా వెళ్లినవారు ఐసీయూలో ఆ కూలర్‌ను పెట్టి దాన్ని ఆన్ చేసేందుకు అక్కడే ఉన్న ఓ ప్లగ్ పీకారు. దాన్ని కూలర్ కు పెట్టి దాన్ని ఆన్ చేశారు. కానీ వాళ్లు తీసేసింది  వెంటిలేటర్ ప్లగ్‌.  దాని స్థానంలో కూలర్ ప్లగ్ పెట్టి దాన్ని ఆన్ చేశారు. 
కానీ..ప్లగ్ తీసివేసని వెంటిలేటర్ కాసేపటి వరకూ బ్యాటరీపై నడిచింది. కాసేపటికి దాంట్లో ఉండే పవర్ కూడా అయిపోవటంతో వెంటిలేటర్ ఆగిపోయింది. దీంతో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు.

అప్పటి వరకూ బాగానే ఉన్న కరోనా పేషెంట్ చనిపోవటాన్ని వైద్య సిబ్బంది గుర్తించారు. ఇదేంటీ ఇప్పటి వరకూ బాగానేఉన్నాడుకదా..ఇంతలోనే ఇలా అయ్యిందేమిటాని..ఆ పరిసరాలను పరిశీలించగా..వెంటిలేటర్ ప్లగ్ తీసేసి ఉండటం..అది కూలర్ కు కనెక్ట్ చేసి ఉండటాన్ని గమనించారు. ఈ విషయాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్  నవీన్ సక్సేనా దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై నవీన్ సక్సేనా పోలీసులకు సమాచారం అందించి దీనిపై ఓ కమిటీని వేశారు. ఈ కమిటీలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్ మరియు సిఎంఓ ఉన్నారు. కమిటీ దర్యాప్తులో భాగంగా కరోనా పేషెంట్ కుటుంబ సభ్యులు వచ్చినట్లుగాను..వాళ్లు కూడా ఓ కూలర్ తెచ్చినట్లుగా దాన్ని కనెక్ట్ చేసేందుకు వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ కు పెట్టినట్లు క్రమంలో బ్యాటరీ కూడా అయిపోవటంతో వెంటిలేటర్ ఆగిపోవటంతోనే కరోనా పేషెంట్ చనిపోయినట్లుగా తేలటంతో దాన్ని నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు.

మరోవైపు సదరు రోగి చనిపోవటంతో అతని కుటుంబ సభ్యులు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయాడని డాక్టర్లపై దాడికి యత్నించారు. తీవ్రమైన అసభ్యంగా దుర్భాషలాడారు. దీంతో  హాస్పిటల్ సీనియర్ డాక్టర్ వరుణ్ ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Read: దేశవ్యాప్తంగా కరోనా టెస్టుకు ఒకే ఫీజు…సుప్రీం కోర్టు