Covid Booster Dose : బూస్టర్ డోసుపై నిపుణుల బృందం చర్చ.. ఏ రకం టీకా.. ఎప్పుడు ఇవ్వాలంటే?

కోవిడ్ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న తర్వాత.. బూస్టర్‌ డోసు (మూడో డోసు) ఎప్పుడు అందించాలని అనేదానిపై భారత వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల బృందం చర్చలు జరుపుతోంది.

Covid Booster Dose : కోవిడ్ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న తర్వాత.. బూస్టర్‌ డోసు (మూడో డోసు) ఎప్పుడు అందించాలని అనేదానిపై భారత వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల బృందం చర్చలు జరుపుతోంది. బూస్టర్ డోసు ఏ రకం టీకా.. ఎంత గ్యాపులో ఇవ్వాలనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. సాధారణంగా రెండో డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలల తర్వాతే బూస్టర్‌ డోసు ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ అధికారవర్గాల సమాచారం. ‘కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు ఎంతకాలం తర్వాత బూస్టర్‌ డోసును ఇవ్వాలనేది నిపుణుల బృందం లోతుగా అధ్యయనం చేస్తోంది.

అయితే మొదటి రెండు డోసులు ఏ రకం టీకా తీసుకుంటే.. మూడో డోసు కూడా అదే ఇవ్వాలని నిపుణుల బృందం సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. రెండో డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలల మధ్యకాలంలో మూడో డోసు అందించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇంతకీ ఎవరికి బూస్టర్ డోసు ఇవ్వాలి? అనేది ప్రధానాశంగా మారింది. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లతో పాటు కోమార్పిడిటీస్ కలిగిన వయో వృద్ధులకు ముందుగా బూస్టర్ డోసు ఇవ్వాలనే చర్చ సాగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా జనవరి 10 నుంచి మూడో డోసు వీరికి అందించే దిశగా కసరత్తు ప్రారంభించింది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని అధికారవర్గాలు వెల్లడించాయి.

Read Also : Covid Booster Dose : కోవిడ్ బూస్టర్ డోసుకు మీరు అర్హులేనా? ఇలా తెలుసుకోండి..!

ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లకు జనవరి 3 నుంచి కరోనా టీకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వైద్యరంగంలోని వారికి ‘ప్రీకాషన్‌ డోసు ఇస్తామని ప్రకటించారు. 60 ఏళ్లు పైబడిన వారిలో అనారోగ్య సమస్యలు ఉన్న వారికి డాక్టర్ల సలహా మేరకు ప్రికాషన్‌ డోసు ఇస్తామని మోదీ అన్నారు. ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ఉధృతి నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయాలను తీసుకుంది. ‘రెండో డోసుకు, ప్రికాషన్‌ డోసుకు మధ్య వ్యవధి 9 నుంచి 12 నెలలు ఉండే అవకాశం ఉంది. ఇమ్యూనైజేషన్‌ విభాగం, ఇమ్యూనైజేషన్‌పై జాతీయ సాంకేతిక సలహా బృందం (NTAGI) తరహాలో సమాలోచనలు సాగిస్తున్నాయని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

Read Also : Covid Vaccine : రెండో డోసు వ్యాక్సినేషన్ 100 శాతం త్వరగా పూర్తిచేయాలి-హరీష్ రావు

ట్రెండింగ్ వార్తలు