Covid in endemic phase: ఎండెమిక్‌ దశకు చేరుకున్న కరోనా: నిపుణులు

కరోనా వైరస్‌ మహమ్మారి స్థాయి నుంచి స్థానికంగా వ్యాప్తి చెందే (ఎండెమిక్‌) దశకు చేరుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని నెలలుగా ప్రజలు కరోనా నిబంధనలు పాటించడం లేదు. అయినప్పటికీ కరోనా కేసులు, మరణాలు తక్కువగా నమోదవుతున్నాయి. దీన్ని బట్టి కరోనా వ్యాప్తి ఎండెమిక్‌ దశకు వచ్చినట్లు చెప్పొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సీజనల్ ఫ్లూ కేసులకు, కరోనాకు అంతగా తేడాలు కనపడట్లేదని చెప్పారు.

Corona Virus

Covid in endemic phase: కరోనా వైరస్‌ మహమ్మారి స్థాయి నుంచి స్థానికంగా వ్యాప్తి చెందే (ఎండెమిక్‌) దశకు చేరుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని నెలలుగా ప్రజలు కరోనా నిబంధనలు పాటించడం లేదు. అయినప్పటికీ కరోనా కేసులు, మరణాలు తక్కువగా నమోదవుతున్నాయి. దీన్ని బట్టి కరోనా వ్యాప్తి ఎండెమిక్‌ దశకు వచ్చినట్లు చెప్పొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం సీజనల్ ఫ్లూ కేసులకు, కరోనాకు అంతగా తేడాలు కనపడట్లేదని చెప్పారు. అయినప్పటికీ, కొత్త వేరియంట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందే ముప్పు ఉందని తెలిపారు. ప్రస్తుతం ఫ్లూ, కరోనా లక్షణాలు ఒకేలా ఉంటున్నాయని అన్నారు. రోజువారీ కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న తీరు చూస్తుంటే కొవిడ్ ఎండమిక్ దశకి వచ్చినట్లు చెప్పొచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా చెప్పారు.

ఆసుపత్రికి వస్తోన్న కరోనా కేసుల్లో సీజనల్ ఫ్లూ కేసుల కన్నా తక్కువగానే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కరోనా సోకితే దాని తీవ్రత అధికంగా ఉండదని, ఐసీయూలో చేరే అవసరం కూడా రాబోదని ప్రజలు కూడా భావిస్తున్నారని చెప్పారు. కొత్తగా పుట్టుకు వచ్చే ప్రతి కరోనా వేరియంటునూ ఆందోళనకర వేరియంట్ గా చెప్పలేమని సీనియర్ వైద్యుడు చంద్రకాంత్ లహరియా అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..