Buddhadeb Bhattacharya : క్షీణించిన కమ్యూనిస్ట్ దిగ్గజం ఆరోగ్యం

కమ్యూనిస్టు దిగ్గజం,పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(77), ఆయన భార్య మీరా భట్టాఛర్జీ గత వారం కరోనా బారినపడిన విషయం తెలిసిందే.

Buddhadeb Bhattacharya కమ్యూనిస్టు దిగ్గజం,పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(77),ఆయన భార్య మీరా భట్టాఛర్జీ గత వారం కరోనా బారినపడిన విషయం తెలిసిందే. అప్పుడే మీరా భట్టాఛర్జీ.. హాస్పిటల్ లో చేరగా.. బుద్ధదేవ్​ ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే మంగళవారం మీరా భట్టాఛర్జీ ఆరోగ్యం క్షీణించింది. ఆక్సిజన్ లెవల్స్ ఒక్కసారిగా 90శాతం కంటే తక్కువకు పడిపోయాయి. దీంతో డాక్టర్ల సూనచ మేరకు ఆయనను వెంటనే హాస్పిటల్ కు తరలించారు కుటుంబసభ్యులు.

కాగా,బుద్ధదేవ్ భట్టాచార్యకు ఊపిరితిత్తుల సమస్య కూడా ఉంది. 10 ఏళ్ల నుంచి ఆయన క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(COPD)తో బాధపడుతున్నారు. గతేడాది అక్టోబర్ లో శ్వాస సంబధిత మరియు రక్తంలో ఆక్సిజన్ కౌంట్ సమస్యలతో భట్టాచార్య హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కొద్ది రోజులు ఆయన వెంటిలేటర్ పై కూడా ఉన్నారు. అయితే అప్పుడు భట్టాచార్యకు కరోనా నెగిటివ్ గానే తేలింది. బుద్ధదేవ్ భట్టాచార్య..2000-2011వరకు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.

మరోవైపు,కరోనాతో ఈ నెల 18న దక్షిణ కోల్ కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ చేరిన బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా భట్టాఛర్జీ కరోనా నుంచి కోలుకుని సోమవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు