Covid Vaccine Doses Gap : కోలుకున్నాక.. 6 నెలల తర్వాతే కరోనా వ్యాక్సిన్.. డోసుల మధ్య గ్యాప్ ఎంతంటే?

కరోనా నుంచి కోలుకున్నవారికి ఆరు నెలల తర్వాతే వ్యాక్సిన్ తీసుకునేందుకు వీలుంటుంది. అలాగే కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ 12-16 వారాలకు పెంచాలని నిపుణుల ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

Covid Vaccine Doses Gap : కరోనా నుంచి కోలుకున్నవారికి ఆరు నెలల తర్వాతే వ్యాక్సిన్ తీసుకునేందుకు వీలుంటుంది. అలాగే కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ 12-16 వారాలకు పెంచాలని నిపుణుల ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రానికి జాతీయ సాంకేతిక సలహా బృందం కీలక సూచనలు చేసింది.

కోవాగ్జిన్ డోసుల్లో మార్పులేదని స్పష్టం చేసింది. కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచవచ్చని సిఫార్సు చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వినియోగిస్తోన్న మరో టీకా కొవాగ్జిన్‌కు సంబంధించి డోసుల మధ్య అంతరంపై ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని గతంలోనే కేంద్రం పొడిగించింది. కరోనా టీకాతో మెరుగైన ఫలితాలు పొందేందుకు డోసుల మధ్య వ్యవధిని 28 రోజుల నుంచి 6-8 వారాలకు పెంచుతూ మార్చిలో నిర్ణయం తీసుకుంది.

గర్భిణి స్త్రీలు కూడా తాము ఏ వ్యాక్సిన్ వేసుకోవాలో ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనుంది. డెలివరీ తర్వాత తల్లులు పాలిచ్చే సమయంలోనే వ్యాక్సిన్ తీసుకోవచ్చునని సూచించింది. కేంద్రం కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను కేంద్రం అర్హులందరికీ అందిస్తోంది. ఇప్పటి వరకు 17.72 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు