Corona Vaccine: రెగ్యులర్ మార్కెట్లోకి వస్తే రూ.275లుగా కోవాక్జిన్, కోవిషీల్డ్ ధరలు?

భారత్ లో తయారయ్యే కోవాక్జిన్, కోవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తయారీ సంస్థలు భారత డ్రగ్ నియంత్రణ సంస్థ అనుమతి కోరాయి

Corona Vaccine: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు టీకాయే ప్రత్యామ్న్యాయంగా నిలిచిన తరుణంలో.. భారత్ లో శరవేగంగా కరోనా టీకా పంపిణీ కొనసాగుతుంది. ఈక్రమంలో కరోనా వాక్సిన్లను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసేందుకు టీకా తయారీ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. భారత్ లో తయారయ్యే కోవాక్జిన్, కోవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తయారీ సంస్థలు భారత డ్రగ్ నియంత్రణ సంస్థ DCGI అనుమతి కోరాయి. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ ఎంత ఉండాలన్న అంశంపై ఒక నివేదిక ఇవ్వాలంటూ DCGI.. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA)ను కోరింది.

Also reead: Governor Tamilisai: సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లాకు గవర్నర్ తమిళిసై ప్రత్యేక అభినందనలు

కాగా.. రాబడిన సమాచారం మేరకు..బహిరంగ మార్కెట్లో కోవాక్జిన్, కోవిషీల్డ్ టీకాల ధరలు రూ.275/ఒక్క డోసుకి ఉంటుందని తెలిసింది. టీకా ధర రూ.275 ఉంటుండగా.. సేవా రుసుము కింద మరో రూ.150లను అదనంగా వసూలు చేయనున్నారు. ఇప్పటివరకు 75 శాతం ప్రభుత్వ – 25 శాతం ప్రైవేట్ పద్దతిలో కరోనా టీకాలు అందిస్తున్నారు. వీటిలో ఒక డోస్ కోవాక్సిన్ ధర రూ. 1,200 కాగా, కోవిషీల్డ్ ధర రూ. 780గా ఉంది. ప్రస్తుతం భారత్ లో అత్యవసర వినియోగానికి మాత్రమే టీకాలకు అనుమతి ఉంది. టీకాల పనితీరు, ఆరోగ్యంపై ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న “సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్”..కరోనాను కట్టడి చేసేందుకు బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయాలనీ కేంద్రానికి సూచించింది.

Also read: Bike Launch: భారత మార్కెట్లోకి హోండా CBR650R 2022 మోడల్, ధర ఎంతో తెలుసా?

మరోవైపు జనవరి 26 సాయంత్రం వరకు దేశ వ్యాప్తంగా 163.58కోట్ల కరోనా వాక్సిన్లు పంపిణీచేశారు. ఈప్రకారం దేశ జనాభాలో ఒక్కొక్కరు కనీసం ఒక్కసారైనా టీకా తీసుకున్నారు. అయితే కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రతి ఆరు నెలలు/ఏడాది కాలం వ్యవధిలో బూస్టర్ డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈక్రమంలో టీకాలు ప్రజలందరికి చేరువయ్యేలా బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయడం ఉత్తమమని ఫార్మా సంస్థలు భావించాయి.

Also read: Corona World: వారం వ్యవధిలో 2 కోట్లకుపైగా కొత్త కరోనా కేసులు

ట్రెండింగ్ వార్తలు