Cow comforting a child
Cute video of a cow comforting a child : కొన్ని జంతువులు చిన్నపిల్లలతో అనుబంధాన్ని పెనవేసుకుంటాయి. వారికి ఎటువంటి హాని కలిగించవు. ఓ పసిబిడ్డను ఆవు ఓదారుస్తున్న వీడియో అందరి మనసుని హత్తుకుంది.
Man saved the cow : ఆవు దూడని రక్షించడం కోసం అతను ఏం చేశాడంటే? .. మనసుని కదిలించే వీడియో వైరల్
చిన్న పాప, ఆవు మధ్య అనుబంధాన్ని చూపే అందమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ని ఆకర్షించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో emotional_reels_gb అనే యూజర్ ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియో ముచ్చట గొల్పుతోంది. మంచంపైన కూర్చున్న చిన్నారిని నిమురుతూ ఓదారుస్తున్న ఆవు.. ఆవుకు అస్సలు భయపడకుండా హత్తుకున్న చిన్నారి క్యూట్ వీడియో అందరి మనసులు కొల్లగొట్టింది. నిజానికి పసిపాపని ఆవుకి అంత దగ్గరలో ఉంచడానికి ఫ్యామిలీ మెంబర్స్ భయపడతారు. ఎందుకంటే సాధు జంతువులే అయినప్పటికీ ఒక్కోసారి వాటికి హాని చేస్తారేమో అనే భయంతో అవి దాడి చేస్తుంటాయి.
Viral Video: ముఖ్య అతిథిగా హాజరై రెస్టారెంట్ ప్రారంభించిన ఆవు
ఇక ఈ వీడియో చూసిన వారు “క్యూట్ నెస్ ఓవర్ లోడ్” అని ఒకరు.. “ఓ మై హార్ట్..” అని ఇంకొకరు కామెంట్లు పెట్టారు. చాలామంది హార్ట్ ఎమోజీలను పంపారు.