Viral Video: ముఖ్య అతిథిగా హాజరై రెస్టారెంట్ ప్రారంభించిన ఆవు

రెస్టారెంట్ పేరు ‘ఆర్గానిక్ ఒయాసిస్’. ఈ రెస్టారెంటులో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని కస్టమర్లకు అందించనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఇక చర్చంతా ఆవు ముఖ్యఅతిథిగా రెస్టారెంటును ప్రారంభించడం మీదే కొనసాగుతోంది.

Viral Video: ముఖ్య అతిథిగా హాజరై రెస్టారెంట్ ప్రారంభించిన ఆవు

Cow Inaugurates Restaurant

Viral Video: షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు ప్రారంభోత్సవాలకు సెలెబ్రిటీలు హాజరు కావడం సర్వసాధారణం. ఎక్కడో ఒకచోట కాస్త భిన్నంగా ఆలోచించేవారు సెలెబ్రిటీలను కాకుండా మామూలు వ్యక్తులతో చేస్తుంటారు. అయితే ఇలాంటివి ఎప్పుడో ఎక్కడో కానీ కనిపించవు. ఇకపోతే.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో తాజాగా ఒక రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే.. నగరంలో ఏర్పాటైన మొట్టమదటి ఆర్గానిక్ రెస్టారెంట్. ఇందులో మరింత ప్రత్యేకత ఏంటంటే.. ఈ రెస్టారెంటును ఒక గోవు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం.


రెస్టారెంట్ పేరు ‘ఆర్గానిక్ ఒయాసిస్’. ఈ రెస్టారెంటులో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని కస్టమర్లకు అందించనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఇక చర్చంతా ఆవు ముఖ్యఅతిథిగా రెస్టారెంటును ప్రారంభించడం మీదే కొనసాగుతోంది. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసిన వీడియో ప్రకారం.. కొంతమంది వ్యక్తులతో కలిసి ఆవు రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నట్లు చూడవచ్చు. పసుపు వస్త్రాన్ని ఆవు మీద కప్పారు. రెస్టారెంట్‌లోని కార్మికులు కూడా ‘ఆర్గానిక్ ఒయాసిస్’ టీ-షర్టులు ధరించి కనిపిస్తారు.

Pulwama Attack: పుల్వామా దాడిని అడ్డు పెట్టుకుని మోదీ ఓట్లు అడిగారా? మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోపణ ఏంటి?

మాజీ డిప్యూటీ ఎస్పీ అయిన శైలేంద్ర సింగ్.. ఈ రెస్టారెంట్ యజమాని. కాగా, ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవం గురించి ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం ఆవుల మీద ఆధారపడి ఉన్నాయని, అందుకే తాను ఆర్గానిక్ ఒయాసిస్‌లో గౌరవ అతిథిగా “గోమాత”ని ఎంచుకున్నానని తెలిపారు. ”ఆరోగ్యకరమైన శరీరమే తమ మొదటి ప్రాధాన్యతని ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు. దురదృష్టవశాత్తు, మీరు రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఉపయోగించి ఉత్పత్తి చేసిన ఆహారాన్ని పొందుతారు. భారతదేశంలో సొంతంగా ఉత్పత్తి, నియంత్రణ, ప్రాసెసింగ్‌ను కలిగి ఉన్న మొదటి రెస్టారెంట్ ఇదే అని నేను భావిస్తున్నాను. మా ఆహారం తీసుకున్న తర్వాత తేడాను గమనిస్తారు’’ అని అన్నారు.