Pulwama Attack: పుల్వామా దాడిని అడ్డు పెట్టుకుని మోదీ ఓట్లు అడిగారా? మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోపణ ఏంటి?

తన ట్వీటులో పుల్వామా దాడి అనే హ్యాష్‭ట్యాగ్ జతచేశారు. వాస్తవానికి పుల్వామా దాడిని మోదీ తన రాజకీయాల కోసం వాడుకున్నారనే విమర్శ ఉంది. అయితే ఆ విషయాన్ని విపక్షాలు, విమర్శకులు మర్చిపోయి చాలా రోజులైంది. అయితే సత్యపాల్ మాలిక్ మళ్లీ దాన్ని పైకి తోడారు.

Pulwama Attack: పుల్వామా దాడిని అడ్డు పెట్టుకుని మోదీ ఓట్లు అడిగారా? మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోపణ ఏంటి?

Modi and satyapal malik

Pulwama Attack: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‭లోని పుల్వామాలో జరిగిన దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం గురించి దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చెప్తే.. మౌనంగా ఉండమని సలహా ఇచ్చినట్లు నాలుగు రోజుల క్రితం ఒక జాతీయ న్యూస్ చానల్‭తో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి గవర్నర్‭గా పని చేసిన సత్యపాల్ మాలిక్ అన్నారు. కాగా, ఈ విషయాన్ని తాజాగా మరోసారి ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడి జరిగిన కొద్ది రోజులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘బహుశా ఇందుకేనేమో నన్ను మౌనంగా ఉంచారు’’ అంటూ సత్యపాల్ మాలిక్ విరుచుకుపడ్డారు.

Karnataka polls: కర్ణాటక ఎన్నికల స్టార్ క్యాంపైనర్లను ప్రకటించిన కాంగ్రెస్.. జాబితాలో రేవంత్ రెడ్డి

ఆ వీడియోలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘‘పుల్వామాలో చనిపోయిన అమరవీరులకు మీ ఓట్లు వేయాలని నేను కోరుతున్నాను’’ అని మోదీ ప్రసంగించారు. నేరుగా చెప్పనప్పటికీ.. ఓట్ల కోసమే తనను మౌనంగా ఉండమని మోదీ చెప్పినట్లు సత్యపాల్ మాలిక్ చెప్పినట్లు తెలుస్తోంది. తన ట్వీటులో పుల్వామా దాడి అనే హ్యాష్‭ట్యాగ్ జతచేశారు. వాస్తవానికి పుల్వామా దాడిని మోదీ తన రాజకీయాల కోసం వాడుకున్నారనే విమర్శ ఉంది. అయితే ఆ విషయాన్ని విపక్షాలు, విమర్శకులు మర్చిపోయి చాలా రోజులైంది. అయితే సత్యపాల్ మాలిక్ మళ్లీ దాన్ని పైకి తోడారు.

గతంలో రైతుల ఆందోళన మీద సైతం మోదీ ఇలాగే ప్రవర్తించినట్లు సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. అప్పట్లో ఆయన ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘‘వాళ్లేమైనా (రైతులేమైనా) నాకోసం చనిపోయారా?’’ అని తనతో మోదీ వ్యాఖ్యానించినట్లు సత్యపాల్ మాలిక్ అన్నారు. జమ్మూ కశ్మీర్ గవర్నరుగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మీద కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీద కాని పెదవి విప్పని ఆయన.. మేఘాలయ గవర్నర్ అయిన తర్వాత విమర్శలు ప్రారంభించారు. ఆగస్ట్ 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు జమ్మూ కశ్మీర్ గవర్నర్‭గా సత్యపాల్ మాలిక్ పని చేశారు. అనంతరం ఆయనను మేఘాలయ గవర్నర్‭గా మోదీ ప్రభుత్వం మార్చింది. ఈయన గవర్నర్‭గా ఉన్న సమయంలోనే జమ్మూ కశ్మీర్‭కు కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పుల్వామా దాడి సైతం అప్పుడే జరిగింది.

Maharashtra: ఎన్సీపీతో చేతులు కలపడంపై బీజేపీకి వార్నింగ్ ఇచ్చిన ఏక్‭నాథ్ షిండే

పుల్వామా దాడి అనంతరం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫోన్ చేసి మాట్లాడారట. అయితే ఆ సమయంలో మోదీ చేసిన సూచన విని ఖంగుతిన్నానని అన్నారు. ‘‘మనం చేసిన తప్పు వల్లే ఇలా జరిగిందని (పుల్వామా దాడి) ప్రధాని మోదీతో చెప్పాను. విమానం సమకూర్చి ఉంటే ఇలా జరిగేది కాదని అన్నాను. కానీ ఆయన నన్ను మౌనంగా ఉండమని అన్నారు(యే మత్ బోలియే, యాప్ చుప్ రహియే)’’ అని అన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం తనను మౌనంగా ఉండమని సూచించినట్లు తెలిపారు.