Cow Urine: గోమూత్రం మనుషులకు హానికరం.. ఐవీఆర్ఐ పరిశోధనలో వెల్లడి

ఆయుర్వేదంలో గోమూత్రం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి చెప్పారని, ఇది అనేక రకాల వ్యాధులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఆవు మూత్రంలో కుకురిన్ ఉంటుందని, ఇది క్యాన్సర్ వంటి వ్యాధులను నయం చేస్తుందని పేర్కొన్నారు

Cow Urine: వాస్తవానికి ఇది ఇప్పటి మాట కాకపోయినా ‘గోమూత్రం రోగాలను నయం చేస్తుంది’ అనే ప్రచారం దేశంలో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. సమాజంలో పేరు పొందిన వారు, రాజకీయ నేతలు కూడా ఈ విషయాన్ని అప్పుడప్పుడు ప్రస్తావిస్తుంటారు. ఇక కొద్ది కాలంగా అయితే ఇది విస్తృత ప్రచారంలో ఉంది. కానీ శాస్త్రీయ పరిశోధనలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. తాజాగా ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన పరిశోధనలో ఇదే విషయం వెల్లడైంది. గోమూత్రం మనుషులకు మంచిది కాదని తేల్చి చెప్పింది. దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని పేర్కొంది. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే.. గేదె మూత్రం ప్రయోజనకరంగా ఉంటుందని వెటర్నరీ పరిశోధనలో తేలడం.

Amit Shah: మూడోసారి కూడా బీజేపీయేనట.. ఎన్ని సీట్లు వస్తాయో లెక్క చెప్పిన అమిత్ షా

ఆవు మూత్రంలో అనేక రకాల బాక్టీరియా ఉంటాయట. ఇవి కడుపు వ్యాధులకు కారణమవుతాయని పరిశోధనలు చెబుతున్నారు. బికనీర్‌లోని భారతీయ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధికారి డాక్టర్. ఎన్ఆర్ రావత్ మాట్లాడుతూ.. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనేది జంతువులపై పరిశోధనలు చేస్తున్న ఒక పెద్ద సంస్థని, అలాంటి అధ్యయనం చెప్పిన విషయాన్ని తప్పు పట్టలేమని అన్నారు. ఇంతకు ముందు కూడా గోమూత్రం వల్ల కలిగే హాని గురించి కొన్ని నివేదికలు చెప్పాయని, గోమూత్రం సంతానలేమితో బాధపడేవారికి హాని చేస్తుందని కూడా కొన్ని పరిశోధనల్లో వెల్లడైందని అన్నారు.

Rahul Gandhi: వయనాడ్‭లో భారీ ర్యాలీ చేపట్టిన రాహుల్ గాంధీ.. అనర్హతపై తీవ్ర విమర్శలు

అయితే, ఈ అధ్యయనాన్ని అంతిమంగా పరిగణించకూడదని మాత్రం ఆయన చెప్పడం కొసమెరుపు. మరిన్ని నమూనాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, ఇది మరింత కాలం పాటు జరిగే అధ్యయనమని అన్నారు. అలాగే గేదె మూత్రం ఎంత వరకు ఉపయోగపడుతుందో కూడా మరోసారి తేల్చాల్సి ఉందని అన్నారు. ఇక ఇదే విషయమై ఆయుర్వేద డాక్టర్ రాహుల్ కుమార్ పరాశర్ మాట్లాడుతూ ఆయుర్వేదంలో గోమూత్రం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి చెప్పారని, ఇది అనేక రకాల వ్యాధులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఆవు మూత్రంలో కుకురిన్ ఉంటుందని, ఇది క్యాన్సర్ వంటి వ్యాధులను నయం చేస్తుందని పేర్కొన్నారు. గోమూత్రం వల్ల కలిగే హాని గురించి ఆయుర్వేదం చెప్పలేదని, చర్మ వ్యాధులకు కూడా గోమూత్రం మేలు చేస్తుందని అన్నారు. ఈయన కూడా ఈ అధ్యయనాన్ని మరింత కొనసాగాలని సూచించారు.

Arvind Kejriwal: జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండమంటూ పార్టీ నేతలను హెచ్చరించిన అరవింద్ కేజ్రీవాల్

ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఈ పరిశోధనలో 73 గేదెల నమూనాలను అధ్యయనం చేశారు. ఇందులో ఆవు, గేదె, మనుషుల మూత్ర నమూనాలను పరీక్షించారు. కాగా, గోమూత్రంలో 13 హానికారక బ్యాక్టీరియా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఇది కడుపులో అనేక రకాల వ్యాధులకు కారణమవుతుందని పరిశోధకులు తేల్చి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు