Noida Dowry Murder: జుట్టుపట్టి ఈడ్చుకెళ్లి.. ఒంటిపై పెట్రోల్ పోసి.. బాబోయ్.. దారుణ ఘటన.. కిరాతకంగా ప్రవర్తించిన భర్త.. ఆరేళ్ల కొడుకు ఏం చెప్పాడంటే..

గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళపై భర్త, అత్తమామలు దాడి చేశారు. (Crime News) భర్త దారుణంగా ప్రవర్తించాడు.

Noida Dowry Murder: గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళపై భర్త, అత్తమామలు దాడి చేశారు. (Crime News) భర్త దారుణంగా ప్రవర్తించాడు. భార్య జట్టును పట్టుకొని ఈడ్చుకెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Medchal district : భార్యను ముక్కలు చేసిన కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఆ 25 రోజుల్లో ఏం జరిగింది.. మృతురాలి తల్లి ఏం చెప్పారంటే..

మృతురాలి సోదరి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాకు చెందిన నిక్కీని, ఆమె అక్క కంచన్‌ను సిర్సా ప్రాంతానికి చెందిన అన్నదమ్ములకు ఇచ్చి తల్లిదండ్రులు 2016లో వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నంగా కారు, విలువైన వస్తువులు ఇచ్చారు. అయితే, గత కొద్దికాలంగా అదనపు కట్నంకోసం భర్త విపిన్, అత్తమామలు నిక్కీని వేధించడం మొదలు పెట్టారు. అదనంగా మరో రూ.35లక్షలు ఇవ్వాలని వేధింపులకు గురిచేసినట్లు మృతురాలి సోదరి కంచన్ తెలిపింది.

ఈనెల 21న అదనపు కట్నం కావాలంటూ భర్త, అత్తమామలు నిక్కీని ఓ గదిలో బంధించి దాడి చేశారు. తన సోదరిని కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని, నిక్కీని ఆమె భర్త జుట్టుపట్టి లాక్కెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని కంచన్ కన్నీరు మున్నీరైంది. తీవ్ర గాయాలతో పడిఉన్న నిక్కీని స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారని మృతురాలి అక్క కంచన్ పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, ఈ ఘటనకు సంబంధించి నిక్కీకి చెందిన ఆరేళ్ల కుమారుడు కన్నీరు పెట్టుకుంటూ అమ్మను నాన్న, నానమ్మ కొట్టారంటూ మీడియాకు తెలిపాడు. అమ్మపై ఏదో పోసి లైటర్‌తో నాన్న నిప్పంటించాడంటూ ఆరేళ్ల బాబు తన తల్లి మరణం గురించి కన్నీరు పెట్టుకుంటూ మీడియా ముందు చెప్పడంతో అక్కడి వారిని కంటతడి పెట్టించింది. నిక్కీ మరణంపై ఆమె తండ్రి మాట్లాడుతూ.. నిక్కీ భర్త విపిన్ ను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. విపిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.